10, నవంబర్ 2016, గురువారం

కరెన్సీ నోట్లను ప్రభుత్వాలు రద్దు చేయొచ్చా! అటువంటి అధికారం వాటికి ఉందా!


ఈ  అంశాలపై  తీవ్రమైన చర్చ సాగుతోంది.
రద్దు చేసే అధికారం వుంది అని వాదించేవాళ్ళతో ఏ చిక్కూ లేదు. కానీ లేదనే వాళ్ళు ఒక వాదం చెబుతున్నారు. ఒక రూపాయి నోటు మీద ఫైనాన్స్ సెక్రెటరీ సంతకం వుంటుంది. అదే అంతకు మించిన విలువకలిగిన నోట్లమీద ‘ఇది ప్రామిసరీ నోటు. ఇది కలిగిన వాళ్లకు అదే విలువను తిరిగి చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంకు పూచీ ఇస్తున్నట్టు రాసివుంటుంది.

(I PROMISE TO PAY THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE THOUSAND RUPEES) ప్రామిసరీ నోటు చెల్లుబడికి కొంత కాల వ్యవధి వుంటుంది. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోటు కు కాల వ్యవధి వుండదు. ఒకవేళ కాలదోషం పడితే అంటే బాగా నలిగిపోయి చిరిగిపోయే స్థితికి చేరుకుంటే దాన్ని రిజర్వ్ బ్యాంకులో ఇచ్చి కొత్త నోటు తీసుకునే వీలుంది. ప్రభుత్వాలకు కరెన్సీని   చెలామణీ నుంచి తప్పించే అధికారం వుంటుంది కానీ వాటిని పూర్తిగా రద్దుచేసే అధికారం లేదన్నది వారి వాదన. పాత నోటు అంటే చెలామణీ నుంచి తప్పించిన నోటుకి బదులు వేరే నోటు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి వుంటుంది.  బ్యాంకులు డిపాజిట్ చేయడానికి తిరస్కరించ కూడదు అనేది వారి అభిప్రాయం. కాకపొతే, అలాంటి డిపాజిట్ దారులని ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించే వీలుంటుంది.

ఈ వాదన ఎంతవరకు సబబు అనేది ఇటువంటి ఆర్ధిక విషయాల్లో నిష్ణాతులయిన వాళ్ళే చెప్పాలి

NOTE: COURTESY IMAGE OWNER       

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

@ వాటిని పూర్తిగా రద్దుచేసే అధికారం లేదన్నది వారి వాదన....

సీనియర్లు...తమకు తెలియనిది ఏముంది...కరెన్సీ రద్దు చేయలేదు...వారు ప్రామిస్ చేసినట్టు..కరెన్సీని బాంకుల్లో...పోస్టాఫీసుల్లో...మార్చుకుని...కొత్త కరెన్సీ ని తీసుకోమన్నారంతే....ఎవరి దగ్గర వున్న డబ్బూ రద్దు కాబడలేదు....బాంకుల్లో నుంచి కొత్త కరెన్సీ తీసుకుంటున్నాం...బాంకులూ..పోస్టాఫీసులు...మీరిచ్చిన కరెన్సీ విలువ లేదు...రద్దు చేయబడిందన్నపుదు సమస్య...మేమిచ్చిన కరెన్సీ కు సమానమయిన విలువ గల కొత్త కరెన్సీ ని బాంకులు మాకు అంద చేస్తున్నయి...రద్దు చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవలేదు..కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చినపుడు ప్రభుత్వం కొన్ని కీలకమయిన చర్యలకు ఉపక్రమించడం తప్పదు కదా?ప్రధానిగా ఇందిరా గాంధీ బాంకులను జాతీయం చేయ వలసిన పరిస్థితి అప్పట్లో కలిగింది కదా?

sarma చెప్పారు...

మీకు గుర్తుండి ఉండాలి(I PROMISE TO PAY THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE THOUSAND RUPEES) బదులు ON DEMAND అనే పదం ఉండేది,(I PROMISE TO PAY ON DEMAND THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE THOUSAND RUPEES) అది తొలగించారు,ఎప్పుడో గుర్తుందా?

విషయం సుప్రీం కోర్ట్ తేలుస్తుందిగా