23, మార్చి 2022, బుధవారం

యూనిసెఫ్ యాడ్స్

 ఆ చేత్తోనే యూనిసెఫ్ యాడ్స్ మీద కూడా ఒక కన్నేస్తే బాగు. క్రాస్ రోడ్స్ లో పసిపిల్లలను ఎండలో తిప్పుతూ ముష్టి అడిగే వాళ్లకు, ఎండిపోయిన డొక్కలతో పిల్లల్ని చూపిస్తూ కేవలం నెలకు ఎనిమిది వందలు మాత్రమే విరాళాలు ఇవ్వండని దేబిరించే వీళ్లకు నాకు తేడా కనపడడం లేదు. నిజం నిష్టూరంగా నే వుంటుంది మరి.

(Central Consumer Council imposed Rs 10 lakh fine on the manufacturers of SENSODYNE tooth paste for misleading ads )

https://www.ndtv.com/business/sensodyne-fined-rs-10-lakh-by-consumer-body-over-misleading-ads-2836394?amp=1&akamai-rum=off&fbclid=IwAR1cOaR7E9_Mfp9AV7PfV6qy-uvu1EMRvIms-4WTb1rMXWttnjdKvUFnTJw4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నేను ఉండేది యూరోప్ లో ఎక్కడో మారు మూల , ఈ టౌన్ లో ఇండియన్ ఫామిలీ అంటే 2/3 , అందులో నేను, మిగతా ఇద్దరూ ఇండియన్ రెస్తౌరెంట్ ఓనర్స్ . మొన్న మా ఊళ్ళో స్కూల్ వెబ్సైటు browse చేస్తుంటే, ఈ స్కూల్ నుండి , తమిళనాడు లో మారుమూల ఉన్న మిషనరీ స్కూల్ లో ఒక స్టూడెంట్ కి విరాళాలు వెళ్తున్నాయి . ఆ అబ్బాయి ఫొటోస్ మరియు వాళ్ళ ఇళ్ళు చూస్తుంటే నాకే విరాళం ఇవ్వాలని అనిపించింది అది అబద్దం అని తెలుసుండి కూడా . కొన్ని మిషనరీస్ ఎంత ఎక్సప్లోయిట్ చేస్తున్నాయంటే , ఎవ్వరు నమ్మలేరు .

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి డిపార్ట్మెంట్లు గవర్నమెంటులో వున్నాయని అవి అప్పుడప్పుడు పని చేస్తుంటాయని ఇప్పుడే తెలిసివచ్చింది :)

దేశంలో మిగతా పేస్టుల అడ్వర్టైజ్ మెంట్లు కూడా తక్కువకాదే ఈ తరహాలో ?నీహారిక చెప్పారు...

మిగతా యాడ్స్ సంగతెలా ఉన్నా ఆ ఎండు డొక్కల యాడ్ గురించి మాత్రం నేను అనుకునే మాట మీరు వ్రాశారు 🙏
ఇటువంటి వాటివల్ల దేశం పరువు పోతుంది అన్న ధ్యాస కూడా లేదు.

Praveen చెప్పారు...

FYI, No doctor recommends people to use remedies sold in grocery shops for medical use.