10, మార్చి 2022, గురువారం

రూపురేఖలు మారిపోతాయి – భండారు శ్రీనివాసరావు

 

2009 లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో సరి ముఖ్యమంత్రి అయిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ, ఇక నుంచి రాష్ట్రం అభివృద్ధి పధంలో పరుగులు తీస్తుందని, త్వరలోనే రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. ఒక విలేకరి అడిగాడు, రూపు రేఖలు మారడం అంటే రాష్ట్రం మీ హయాములో విడిపోతుందా అని. వై.ఎస్. తనదైన శైలిలో భళ్ళున నవ్వారు.
ఈరోజు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై టీవీ విశ్లేషణలు చూస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చేసిన మాటలు విన్నప్పుడు ఆనాటి ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏమన్నాడు అంటే:
“చూస్తుండండి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్ల్లో కూడా బీజేపీ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, దేశంలో కనీవినీ ఎరుగని మార్పులు చోటు చేసుకుంటాయి. భారత దేశం పేరు హిందూ దేశం అవుతుంది. రాజ్యాంగం మారిపోతుంది.”
ఇంకా ఇలా.....
(10-03-2022)

కామెంట్‌లు లేవు: