18, మార్చి 2020, బుధవారం

సుప్రీం తలుపు తట్టి జగన్ ప్రభుత్వం సాధించింది ఏమిటి? – భండారు శ్రీనివాసరావు


స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేస్తూ ఏపీ ఎలక్షన్ కమిషనర్  ఎన్. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయ స్థానం ధృవీకరిస్తుందని  జగన్ మోహనరెడ్డికి తెలియదని అనుకోలేం. మరి కేసును అక్కడిదాకా ఎందుకు తీసుకువెళ్ళినట్టు. తీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అంతకంటే కావాల్సింది లేదు. అనుకున్న విధంగా ఎన్నికలను  ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయవచ్చు. రాకుంటే..
ఏ ముఖ్యమంత్రి అయినా తాను అనుకున్న విధంగా పధకాలను, ప్రణాలికలను అమలుచేసే వెసులుబాటు వుండాలని కోరుకుంటారు. అది సహజం. అయితే,  ఇలా ఎన్నికల పేరుతొ కోడ్ అమల్లో వున్నప్పుడు, పైగా అది నిరవధికంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ ఆంక్షల పరిధి నుంచి బయటపడాలని చూస్తారు. ఆ కోణంలో చూసినప్పుడు, ఎన్నికల కోడ్  ఎత్తివేస్తూ సుప్రీం ఇచ్చిన  తీర్పు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి కొంత ఊరట కలిగించే వుండాలి.
ఇక్కడ గతాన్ని కొంత గుర్తు చేసుకుందాం. సరిగ్గా ఇలాగే కాకపోయినా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇదే రకమైన పరిస్తితి ఆయన అనుభవంలోకి వచ్చింది.
అలిపిరి దుర్ఘటన తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తలపోశారు. కేంద్రంలో కూడా అనుకూల ప్రభుత్వం వుంది. అయినా చంద్రబాబు భావించినట్టు ఎన్నికలు వెంటనే రాలేదు. రాకపోగా ఆయనది ఆపద్ధర్మ పరిపాలన అయింది. దాదాపు నాలుగు మాసాలపాటు ఉడ్డుగుడుచుకున్నట్టు అయింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలు. వేసవి తోసుకువచ్చింది. నీళ్ళ కరువు. మరోపక్క కరెంటు కష్టాలు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టు అయింది.
తర్వాత ఏం జరిగిందో తెలిసిన చరిత్రే.       

3 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ఇక మిగిలింది ICJ తలుపు తట్టడమేనేమో!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హ్హ హ్హ హ్హ, సూర్య గారూ 😁 👍.

అజ్ఞాత చెప్పారు...

సిగ్గులేని పచ్చ బతుకులు. అడుగడుగునా పాలనకు అడ్డుపడుతూ నిప్పులు పోసుకుంటున్నార్ గదంట్రా. థూ మీ బతుకులు చెడ. వాయిదా నిర్ణయం లో రాజకీయ కోణం ఉంది అన్న వాదన నిజమైంది.