1, జులై 2019, సోమవారం

Bandaru Sreenivas Rao Analysis Over Jagan 30 Days Government Administrat...

వాసిరెడ్డి వేణుగోపాల్ గారికి రోటీ పచ్చడి మాదిరిగా నాకు 'భ' మేనియా. సీరియస్ టీవీ చర్చల్లో మరీ సీరియస్ నెస్ పనికిరాదని అప్పుడప్పుడు ఈ 'భ' ప్రసక్తి తెస్తుంటాను. ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ ఛానల్లో యాంఖర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమం కూడా చిత్రంగా దీంతోనే మొదలయింది. 'చర్చను ముందు భండారు శ్రీనివాసరావు గారితో అదే వత్తు 'భ' శ్రీనివాసరావు గారితో మొదలు పెడతానని అంటే నేను 'వత్తున్నర' అన్నాను. ఆయన ఎంత వత్తినా, నేను ఎంతగా వత్తి౦చినా చివరకు యూ ట్యూబ్ లోకి ఎక్కింది మాత్రం ఉత్త 'బ'. అంతటితో ఆగలే!
శ్రీనివాసరావును 'శ్రీనివాసురావు' అని మార్చి అసలు పేరుకు కు కొంత కొసరు తగిలించారు.
ఇప్పుడు నవ్వుకోవడం నా వంతు.
పొతే ఈనాటి చర్చలో నాతోపాటు శ్రీ నాగుల్ మీరా (టీడీపీ), శ్రీ వంగవీటి నరేంద్ర (బీజేపీ), శ్రీ బాలరాజు, వైసీపీ పోలవరం ఎమ్మెల్యే, ఫోన్ లైన్లో)

https://youtu.be/kXR1VuSHKWU

కామెంట్‌లు లేవు: