24, డిసెంబర్ 2009, గురువారం

ఔదార్యం

ఔదార్యం'ముక్కోపం తగ్గించుకోకపోయినా పరవాలేదు,కానీ చారిటీ అనే గుణం కొంచెం పెంచుకోండి.తరవాత ఏ చీకాకులు వుండవు.
ఔదార్యం పెంచుకోవడం అనేది ఎవరికోసమో కాదు, మీ కోసమే.
అది లోపించడం వల్ల మీరు ఏమి కోల్పోతున్నారో మీకు తెలియదు.ఎదుటివారి లోపాలనూ-బలహీనతలనూ ఔదార్యంతో క్షమించే ఆర్థ్ర్ర హృదయానికి ఎంత ఆనందం లభిస్తుందో మీరు అర్థం చేసుకోవడం లేదు.
అందుకే మళ్ళీ చెబుతున్నాను.
మీ అనందం కోసమే-
మీ జీవిత మాధుర్యం కోసమే
కాస్త ఔదార్యం పెంచుకోండి.
తప్పుచేయడం మానవ లక్షణం
క్షమించడం మానవీయ గుణం అంటారు కానీ-
నన్నడిగితే
తప్పుచేయడం మానసిక దౌర్బల్యం
క్షమించడం మానవ సంస్కారం '
-ఓ శ్రీవారికి ఓ శ్రీమతి (1982)