గుర్తుకు వస్తున్న చిన్నప్పటి తప్పులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గుర్తుకు వస్తున్న చిన్నప్పటి తప్పులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, సెప్టెంబర్ 2026, సోమవారం

గుర్తుకు వస్తున్న చిన్నప్పటి తప్పులు – భండారు శ్రీనివాసరావు

 

“అక్కయ్య ఉత్తరం రాసింది. కాస్త చదివి పెట్టరా!” అంటూ కార్డు ముక్క చేతిలో పెడుతూ అడిగేది అమ్మ. భారత భాగవతాదులు ఆమెకు కంఠతా వచ్చు. కానీ చదవలేదు, రాయలేదు. ఓ బెల్లం ముక్క ఆశ పెడితే కానీ కార్డులో ఏముందో చదివి పెట్టేవాణ్ని కాదు.
అప్పుడు అమ్మ నాతో యెంత అవస్థ పడిందో ఇదిగో ఇప్పుడు ఈ ఎనభయ్ ఏళ్ళ తరువాత తెలిసి వస్తోంది.
కంప్యూటర్ మీద పనిచేయడం రాదా అంటే వచ్చు. అది మధ్యలో మొరాయిస్తే ఏం చేయాలో తెలియదు. పిల్లల్ని అడిగితే కాదనరు కానీ, వాళ్ళ తొందర్లో వాళ్ళు వుంటారు. తమకు తెలిసింది చెబుతారు. తలకు ఎక్కకపోయినా తెలిసినట్టు తలూపుతాము. ఎందుకంటే ఎంతయినా వాళ్ళ కంటే పెద్దవాళ్ళం కదా!
మొబైల్ బిల్లో, కరెంటు బిల్లో కట్టాలి. ( ఇప్పుడు అంటే యాప్స్ వచ్చాయి, అవి లేని రోజుల్లో ముచ్చట ఇది ) పిల్లలు చెప్పినట్టే అన్ని స్టెప్పులు వేస్తాం. చివర్లో ఓటీపీ అంటుంది. అది మొబైల్ కు వస్తుంది. దాన్ని చూసుకుని మళ్ళీ కంప్యూటర్లో తల దూర్చేసరికి టైం అయిపోతుందో ఏమో మళ్ళీ కొత్త ఓటీపీ అంటుంది. ఈసారి సరిగానే సరి చూసుకుని టైప్ చేసి సబ్మిట్ నొక్కుతాము. అమ్మయ్య పనయి పోయిందని సంతోషపడేలోగా ఎర్రర్ అని వస్తుంది. కధ మళ్ళీ మొదలు.
ఇంతకీ డబ్బు పోయినట్టా, అసలుకే పోయినట్టా! కొత్త మనాది మనదవుతుంది.
అమ్మా! ఎక్కడున్నావమ్మా! అప్పుడు ఏడిపించినందుకు ఇప్పుడు నవ్వుకుంటున్నావా తల్లీ!
(ఇప్పుడు అన్నీ మొబైల్ లోనే. లాప్ టాప్ వాడేది తక్కువ)
నా మనుమరాలు జీవిక, నిండా అయిదేళ్లు లేవు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కటక్ లో OUR SAPLINGS PLAY SCHOOL లో చదువుతోంది, ఒకటో క్లాసు కూడా కాదు. ప్రీ స్కూలు. (ఫ్రీ కాదు, బోలెడు ఫీజులు)
ఈ నెల 28 న నర్సరీ క్వార్టర్లీ పరీక్ష అట. ఇంగ్లీష్, హిందీ, లెక్కలతో పాటు, General Awareness test.
స్కూల్లో రుబ్బుడు కాక ఇంట్లో కూడా నేర్పించమని టెస్ట్ పేపర్లు (ప్రశ్నాపత్రాలు) పంపారు. ప్రశ్నలు కొన్ని చాలా అర్థవంతంగా, కొన్ని చిత్రవిచిత్రంగా వున్నాయి.
(పలకా బలపంతో అక్షరాలు దిద్దిన నాకు, ఇవన్నీచాలా కొత్తగా వున్నాయి. ఎందుకంటే మా ఇద్దరు పిల్లల చదువుసంధ్యలు మా ఆవిడే పూర్తిగా చూసుకునేది. వాళ్ళు ఏ క్లాసులో వున్నారు అనేది కూడా నాకు గుర్తుండేది కాదు.)
General Awareness – Oral Questions:
1. What is your name?
2. How old are you?
3. Are you a boy or a girl?
4. What is your favourite colour?
5. What is your favourite fruit?
6. How many members are there in your family?
7. Who are your grandparents?
8. Do you love your family?
9. Where do you live?
10. What is the name of your house?
11. How many rooms are there in your house?
12. Where do you sleep?
13. Where do you cook food?
14. What is the name of your school?
15. Who is your class teacher?
16. What do you carry to school?
17. Where do you study?
18. What do you do in the playground?
19. Who teaches us in school?
20. Who treats sick people?
21. Where do we go to buy medicines?
22. Where do we go to buy vegetables?
23. Where do we go when we need to post a letter?
24. Name any 5 healthy foods
25. Name any 5 junk food
26. Why should we wash our hands before eating?
27. Should we cross the road without an adult?
28. Name any two healthy habits.
29. Name five jungle animals.
30. Name five domestic animals.
ఈ ముప్పయ్ ప్రశ్నలకి తడుముకోకుండా సరిగ్గా జవాబు చెప్పగలిగితే తయారయ్యేది, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న జెంజీలే!
(21-09-2026)