గట్టి బందోబస్తుతో (మధ్యలో జోరున వాన పడ్డా ఒక్క పేజీ కూడా తడవకుండా, లేదా కన్నుకుట్టిన పోస్ట్ మన్ కన్ను ఈ పుస్తకంపై పడకుండా ప్లాస్టిక్ రేపర్లు చుట్టిన అట్టపెట్టెలో పదిలంగా పెట్టి ) చాలా అట్టహాసంతో, రెంటాల జయదేవ్ గారి ఫస్ట్ రీల్ పుస్తకం (గ్రంధం అనాలేమో! అంత పెద్దగా వుంది) ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం మా గృహ ప్రవేశం చేసింది. సినిమాలకి సెన్సార్ కత్తెర లాగా, ఈ గ్రంధాన్ని కళ్ళారా చూడడానికి నిజంగానే కత్తులు, కత్తెరలు వాడాల్సి వచ్చింది. అంత పదిలంగా పంపారు రెంటాల జయదేవ్ గారు. అంత పదిలంగాను చేర్చారు స్పీడ్ పోస్టు వారు. మరి పదిలంగా దాచుకోవాల్సిన పుస్తకం కదా!
ఎంత
లావు పుస్తకం అయినా చదివే కంటికి లోకువే కదా! ఆత్రంగా తిరగేశాను.
ఫస్ట్
లుక్ లో నా ఫస్ట్ ఒపీనియన్ ఒకటే.
ఇది
మామూలు పుస్తకం కాదు, భారతీయ
సినిమా చరిత్ర తెలిపే పరిశోధనా గ్రంధం. నాకే కనుక డాక్టరేట్ ఇచ్చే అధికారం వుంటే
మరో మాట లేకుండా, మరో
క్షణం ఆలోచించకుండా ఈ పుస్తకం రాసిన రెంటాల జయదేవ్ గారికి డాక్టరేట్ ఇచ్చేస్తాను. ఆ అధికారం లేదు కనుక:
ధన్యవాదాలు
డాక్టర్ రెంటాల జయదేవ్ గారు.
మంచి
పుస్తకాలు వేయడంలో ఇప్పటికే మంచి పేరున్న ఎమెస్కోవారికి కూడా ధన్యవాదాలు.
అలాగే
భద్రంగా పుస్తకాన్ని చేర్చిన స్పీడ్ పోస్టు వారికి కూడా థాంక్స్.
చదివిన
తర్వాత మరికొన్ని ముచ్చట్లు.
మన
సినిమా ఫస్ట్ రీల్, రచన: రెంటాల జయదేవ్, ప్రచురణ: ఎమెస్కో, పేజీలు : బోలెడు, వెల : రు. 750/-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి