ఏనాడు తనని గురించి తాను ఆలోచించుకోవడానికి సుతరామూ ఇష్టపడని ఓ వింతమనిషి, 1971 డిసెంబరు 16 న, నా జీవితంలో వెలుగులు విరజిమ్ముతూ ప్రవేశించింది. నలభయ్ ఎనిమిదేళ్లు ఆ సహజీవనం కొనసాగింది. ఉన్నట్టుండి ఓ అర్ధ రాత్రి నన్ను ఒంటరివాడిని చేసి మాయమై పోయింది. ఆ వెలుగుల క్రీనీడలో నా అయోమయపు ప్రయాణం సాగుతోంది. ప్రతి ఏడాది ఇదే రోజున రాత్రి పన్నెండు గంటలు కొట్టగానే ఆదమరచి నిద్రపోతున్న నన్ను లేపి, సుతారంగా నుదుట ముద్దు పెట్టి, శుభాకాంక్షలు చెప్పేది. అప్పటిదాకా ఆ రోజు మా పెళ్లి రోజని నాకు గుర్తు వచ్చేది కాదు. పిచ్చి పెళ్ళాం. పిచ్చిగా నన్ను ప్రేమించింది. అందుకే నన్ను పెద్దమనసుతో మన్నించేది.
Where ever you are, Happy many returns of the day my dear wife Nirmala.
16-12-2024
1 కామెంట్:
🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి