28, ఏప్రిల్ 2020, మంగళవారం

నచ్చడు! నచ్చడంతే!!



అదేదో సినిమాలో ఓ క్యారక్టర్ అంటుంది ‘నాకు నీ ఫేస్ నచ్చలేదు’ అని.
అంటే అతడి మొహం నచ్చకపోతే ఆ వ్యక్తిలో నచ్చదగిన ఏ లక్షణాలు లేనట్టేనా!
ఈ మానసిక వ్యాధికి ఏదన్నా పేరు ఉందేమో తెలియదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న విపరీత వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒకటి మాత్రం సత్యం అనిపిస్తోంది. చంద్రబాబును నచ్చని వారు ఈ జన్మలో అతడ్ని మెచ్చరు. అలాగే జగన్ మోహన రెడ్డి. ఇతడ్ని ద్వేషించేవారికి అందుకు ప్రత్యేకమైన కారణం అక్కరలేదు. ఆ సినిమాలో చెప్పినట్టు జస్ట్ జగన్ మాకు నచ్చడు, నచ్చడంతే! అంతే కాదు, అతడేమి చేసినా మంచయినా సరే మాకు నచ్చదు, నచ్చదు నచ్చదంతే. చంద్రబాబును నరనరాన ద్వేషించేవారిది కూడా ఇదే తరహా! ఆయన ఏ పని చేసినా మాకు నచ్చదు, నచ్చదు గాక నచ్చదు. మరో మాట లేదు.
మరో విషయం ఏమిటంటే వీరెవ్వరూ వాళ్ళపార్టీల కార్యకర్తలు కాదు, వారి అనుచరులు కాదు. వాళ్ళు గెలిచినా, ఓడినా వీళ్ళకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఏదో ప్రయోజనం ఆశించి పెంచుకున్న అభిమానం కాదు వీరిది.
అయినా సరే! మేమింతే మేము మారం అనేది వీరి నినాదం. నాకో డౌటనుమానం. అదేమిటంటే వీరిలో ఎవరికయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు వుందా!


(ఎవరి ఫోటో ముందు పెట్టాలి అనేదానిపై వాదులాట మొదలయినా ఆశ్చర్యం లేదు)

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

psychos :) suffering from BPD

అజ్ఞాత చెప్పారు...

అచ్చంగా గొట్టిముక్కల టైపు అన్నమాట :) భలే చెప్పారండి

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

రెండో అజ్ఞాత గారికి: ఇతరుల పేరు ఈ విధంగా తీసుకురావడం మంచిదంటారా! ఎవరి అభిప్రాయాలు వారివి.

అజ్ఞాత చెప్పారు...

నేనొప్ప! నేనొప్ప!! రిహడాబు దే ఫస్టు మార్కు. రొట్టి ముక్కల......ఉప్చ్ :)

సూర్య చెప్పారు...

ఓటు హక్కు ఉండొచ్చు ఉండకపోవచ్చులెండి! ట్రంపుని తిట్టుకునే వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారా చెప్పండి.
కాకపోతే కొంతమంది మరీ హిరణ్యకశిపుడి టైపు. ఆస్తికులకైతే ఈ పొలికతో జ్ఞానోదయం అయినా అవుతుంది. నాస్తికులకి ఆ అదృష్టం కూడా లేదు!☺️

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ ఎవరి ఫోటో ముందు పెట్టాలి అనేదానిపై వాదులాట మొదలయినా ఆశ్చర్యం లేదు)” //

ఒకప్పుడు అక్కినేని, ఎన్టీయార్ కలిసి నటించిన చిత్రంలో టైటిల్స్ / క్రెడిట్స్ లో ఎవరి పేరు ముందు కనబడాలి అన్న సందిగ్ధత లాగానే ఉంది ఇదీనూ 🙂.

ఇంతకూ మీరు ఏ ప్రాతిపదికన పై రెండు ఫొటోలు ఆ వరసలో పెట్టారు ? ప్రొటోకాల్ పద్ధతి గానీ పాటించారా 🙂 ?