19, ఏప్రిల్ 2020, ఆదివారం

కధలు రాయడం ఎలా!

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఏమంటారు?

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...మీ వద్ద ఈ పుస్తకముందాండి ? బంపట్ నాటి కాలపు రచయితల వ్యాసాల మేలైన పుస్తక మది
ఉంటే పీడీయెఫ్ గా స్కాన్ చేసి పెట్టండి రాబోవు కాలానికి ది యెవర్ బెస్ట్ సంగ్రహంగా నిలుస్తుంది .

ఆ తరువాయి, యండమూరి కూడా అట్లాంటి ఓ పుస్తకం వ్రాసేరు గానీ అదంత యెఫెక్డివ్ కాదనుకుంటా. ( of course its sales would have been higher by fame of Y.)


చీర్స్
జిలేబి

shyam చెప్పారు...


Please p52 for the above article


http://tana-production-blobs.s3.amazonaws.com/docs/default-source/tana-patrika/tana-patrika---march-2020.pdf?sfvrsn=0