17, ఫిబ్రవరి 2014, సోమవారం

"SHOW WILL CONTINUE"

వార్త - వ్యాఖ్య  
తప్పుకుంటారా  తప్పిస్తారా
సీఎం కిరణ్ రేపు (మంగళవారం)మధ్యాన్నం మూడుగంటలకు తమ పదవికి రాజీనామా చేస్తారు. (వార్త)
అంటే ఆఖరివరకు ఆడి ఆఖరి బంతికి  బ్యాట్ పారేసి అవుట్ కావడం.
సీఎం కిరణ్ కొత్తపార్టీ  పెడతారు (వార్త)
అంటే బ్యాట్ పారేయకపోవడం (గెలుపు ఓటమి వోటరు అధీనం)
ఏదిఏమైనా ఆట ముగియడం ఖాయం
కాకపొతే, మేరా నామ్ జోకర్ సినిమాలో రాజకపూర్ చెప్పినట్టు
"SHOW WILL CONTINUE"  
(17-02-2014)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

కికురె ముఖ్యమంత్రిగా ఉండి అంత భీబత్సంగా వ్యతిరేకించడం నుంచీ లోక్ సభ లో జరిగిన ఈ రౌడీజం వరకూ అంతా కాంగ్రెసు వాళ్ళు కూడబలుక్కుని చేసిన దుష్ట నాటకం. తెరాసా లో విలీనానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని విలీనానికి ఒప్పించడానికి వేసిన మాస్టర్ ప్లాన్.

తెరాసాతో విలీనం వల్ల తప్ప సీట్ల సర్దుబాటు వల్ల కూడా తెలంగాణాలో పార్టీకి పరువు నిలబడదని తేలిపోయింది.విలీనానికి ఒప్పుకున్న తెరాసా అధినేతకూ, పక్క తాళం వాయించే ఉద్దండ పండితుడికీ కాంగ్రెసులో సుఖ ప్రయాణానికి మంచి బెర్తులు జమ అయిపోయినాయి. మధ్య అంతరువుల నుంచి కింది వాళ్లకి కూడా కాంగ్రెసు బెర్తులు ఇస్తే పార్టీలో ఉన్న తెకావాలు వూరుకోరు. విలీనం తిరుగుబాట్లు లేకుండా సున్నితంగా జరిగి పోవాలి.అందుకని తెరాసా లో విలీనాన్ని వ్యతిరేకించే వాళ్ళని మాన్సికంగా బ్రేక్ చెయ్యటానికి కొన్ని నెలల క్రితమే అన్ని అంకాలనూ ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ తెరాసా అధినేతకూ తెలుసు, బహుశా ప్లాను ఇచ్చిందే అతను అయి ఉండవచ్చు.

ఇంతకీ జరిగిందీ జరగబోయదీ యేమిటంటే, సభ బయట తమకు మరొకరితో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటానికి పార్లమెంటుని వాడుకోవటం.భారత ప్రజాస్వామ్యానికి మూలమయిన రెండు సభలూ కాంగ్రెసు రాజకీయ వ్యాపారానికి తక్కెడ సిబ్బెములుగా ఉపయోగ పడుతున్న్నాయి.పార్లమెంటు భవనం ఒక వ్యాపార వేత్త తన క్లయింటు తో తనకున్న ఒక ఒప్పందానికి ఆఖరి సంతకాఉ చేసుకునే కాంఫరెన్స్ హాల్ గా ఉపయోగపడుతున్నది.

100+ యేళ్ళ అచరిత్ర గలిగి యెక్కువ కాలం అధికారం లో ఉండి సభాసాంప్రదాయాల్ని పాటించటంలో మిగిలిన వాళ్ళ కన్నా యెక్కువ బాధ్యతగా ఉండాల్సిన పార్టీ సిగ్గు యేమాత్రమూ లేకుండా భాజపా లాంటి జాతీయ పార్టీ లన్నింటి సహకారం తో చెయ్యబోతున్న ఘనకార్యం ఇది.