ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం NTv Rushi's Live Show చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అరవిందకుమార్ గౌడ్ (టీడీపీ), శ్రీ మందా జగన్నాధం (టీఆర్ఎస్), శ్రీ వేణుగోపాల రెడ్డి ( బీజేపీ).
23, అక్టోబర్ 2018, మంగళవారం
NTv LIVE SHOW on KCR Comments on TDP
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం NTv Rushi's Live Show చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అరవిందకుమార్ గౌడ్ (టీడీపీ), శ్రీ మందా జగన్నాధం (టీఆర్ఎస్), శ్రీ వేణుగోపాల రెడ్డి ( బీజేపీ).
లేబుళ్లు:
NTv LIVE SHOW on KCR Comments on TDP
22, అక్టోబర్ 2018, సోమవారం
మంచివాళ్ల మౌనం – భండారు శ్రీనివాసరావు
“Silence is connivance,
Connivance is betrayal,
Betrayal is sin,
Sin is punishable offence”
అవసరమైన సందర్భాలలో మౌనంగా వుండడం
అనేది ఒకరకంగా లాలూచీనే.
లాలూచీ అంటే వెన్నుపోటు
వెన్నుపోటు పొడవడం పాపం
పాపం శిక్షార్హం
స్వేచ్చానువాదం చేస్తే ఆపై ఆంగ్ల
వాక్యాలకు దగ్గరగా నాకనిపించిన అనువాదం ఇది.
కీర్తిశేషులు, మాజీ గవర్నర్ జనరల్ శ్రీ సి. రాజగోపాలాచారి ఆంగ్లంలో తిరగ రాసిన
మహాభారతంలోనిది.
కురుక్షేత్ర యుద్ధరంగంలో అంపశయ్యపై పడుకుని తన ఆఖరి
ఘడియల కోసం ఎదురు చూస్తున్న భీష్మాచార్యులవారితో
కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఇవి.
కదనరంగంలో తీవ్రంగా గాయపడి మరణం
తధ్యమని నిర్ధారించుకున్న పిదప ఇచ్చామరణం అనే వరం కారణంగా అంపశయ్యపై ఆఖరి రోజులు
గడిపే భీష్ముడికి యెనలేని మనోవేదన పట్టుకుంటుంది.
తనొక మహావీరుడు. తెలిసి తెలిసీ ఏనాడూ
ఎలాంటి దుష్ట కార్యం తలపెట్టలేదు. పొరబాటున కూడా పాపానికి ఒడిగట్టలేదు. ఇతరుల
రాజ్యంపై కన్ను వేయలేదు. పరకాంతను చెరబట్టడం సరే కలలో సయితం ఏ కాంత పొందునూ కోరని ఆజన్మ బ్రహ్మచారిని.
ఇలాంటి నాకేల ఈదుస్తితి?
పగలల్లా రణన్నినాదాలు. ప్రళయభీకర ఆయుధ
గర్జనలు. పొద్దువాలేసమయానికి నాటి యుద్ధ పరిసమాప్తి. చుట్టూ శవాల గుట్టలు.
ఆత్మీయుల ఆక్రందనలు. కొసప్రాణంతో మిగిలిన సైనికులు తమ ప్రాణం కాపాడండంటూ చేసే హృదయ
విదారక రోదనలు. ఆసువులు బాసిన అమరుల పార్ధివ శరీరాలను కడుపారా ఆరగించడానికి
ఆకాశంలో గిరికీలు కొట్టే రాబందుల రెక్కల చప్పుళ్ళు. ఆ నిశిరాత్రి సమయంలో చెవులు
చిల్లులు పడేలా నక్కల ఊళలు.
కడుపు తిప్పే ఇటువంటి దారుణ దృశ్యాల
నడుమ నిదురలేని రాత్రులు గడపాల్సిన స్తితి. ఈ దుస్తితి పగవాళ్ళకు కూడా రాకూడదు.
కురుపాండవ వంశాలకే కాదు, యావత్
కురుసామ్రాజ్యానికి పరిరక్షకుడిగా, సకల శస్త్రాస్త్రవిద్యలలో ఆరితేరినవాడిగా, సమస్త ధర్మశాస్త్రాలు
పుణికిపుచ్చుకున్నవాడిగా, త్యాగానికి మారుపేరుగా, ఆడిన మాట తప్పనివాడిగా,
శత్రువుకు వెన్ను చూపని వీరాధి వీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తన
కడసారి ఘడియలు ఈ విధంగా గడుస్తాయని ఏనాడూ అనుకోలేదే. ఎందుకిలా జరిగింది? నేను
చేసిన పాపం ఏమిటి?
అంటూ కుమిలిపోతున్న భీష్ముడి అంతరంగ
వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఇది.
“ధృతరాష్ట్రుడి నిండు కొలువులో దుర్యోధనాదులు పాంచాలిని
వివస్త్రను చేసే సందర్భంలో కాపాడమని ఆ ఆబల కోరినదెవరినో గుర్తున్నది కదా గాంగేయా!
భీష్మ, ద్రోణ, అశ్వద్ధామ, కృపాచార్యులను. ఎందుకంటే వారు సర్వ ధర్మాలను ఎరిగిన
వారు. ఏది మంచో ఏది చెడో నిర్భయంగా చెప్పగలిగిన సమర్ధులు. సర్వ శక్తిమంతులు కూడా. అప్పటి
ఆనాటి మీ మౌనం ఎంతటి అనర్ధానికి కారణం
అయిందో ఇప్పటికయినా తెలిసి వచ్చిందా!”
ఈఉదయం
జర్నలిష్టు కాలనీలో AP 24 X 7 స్టూడియోకు
వెళ్లి జర్నలిష్టు మిత్రుడు, నడిచే ఎన్ సైక్లోపీడియా పాశం యాదగిరి ఇంటిమీదుగా
వస్తూ అతడికి ఫోను చేసాను. షరామామూలు కులాసా కాలక్షేపం కబుర్లకోసం కాదు. పనికొచ్చే
నాలుగు ముక్కలు చెబుతాడని. నేను అనుకున్నట్టే యాదగిరి పొద్దున్నే ఏ కళన ఉన్నాడో
ఏమో కానీ మంచివాళ్ల మౌనం అంశం ఎత్తుకున్నాడు. చాలా చాలా విషయాలు చెప్పాడు. జాతికి
మెదళ్లవంటి మేధావుల అధోగమన తీరుతెన్నులు గురించి చెప్పాడు. అన్నీ రాయాలంటే అదో
గ్రంధం అవుతుంది.
అమావాస్య పున్నములకు ఓసారి అన్నట్టుగా
ఎప్పుడో కాని కాగితం మీద కలం పెట్టని యాదగిరిని నేను కోపగించుకునేది ఈ ఒక్క
విషయంలోనే. రాయి యాదగిరీ! రాయి!! యాదొచ్చినవన్నీ అప్పుడప్పుడన్నా రాస్తుండు. మాకోసం అయినా!
కేసీఆర్ దూకుడు, మహాకూటమి
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొనవాళ్ళు: శ్రీ కార్తీక్ రెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి (టీఆర్ఎస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ).
లేబుళ్లు:
కేసీఆర్ దూకుడు,
మహాకూటమి
20, అక్టోబర్ 2018, శనివారం
మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు
నిన్న తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి
కొంత సమయం పట్టిన మాట నిజం.
ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు
కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి
హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా
పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన
మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు
చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత
నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు
పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ
ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక
తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత
ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ,
మల్లయ్యల కడసారి కుమార్తె. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు.
బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు
అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇల్లు మారుతూ వచ్చినా ఆ కుటుంబం
మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ
మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని
పెట్టుకుంది. సందీప్ ఇప్పుడు తొమ్మిదో
తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న
అతడికి ఈ ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా
ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం
దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్
కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి
ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన
తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో
వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
నువ్వేం చేస్తున్నావని అడిగితే,
‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే
వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని
పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు
చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!
Discussion on Rahul Gandhi's Telangana Tour | Public Point | Part 1 | AB...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......
లేబుళ్లు:
ABN debate on Rahul Telangana visit
Discussion on Rahul Gandhi's Telangana Tour | Public Point | Part 2 | AB...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......
లేబుళ్లు:
ABN debate on Rahul Telangana visit
19, అక్టోబర్ 2018, శుక్రవారం
సతీమణి అంటే....... భండారు శ్రీనివాసరావు
ఎమ్మెస్సార్ కృష్ణారావు గారు. రేడియోలో
నా సీనియర్ కొలీగ్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారిగా హైదరాబాదులో, ఢిల్లీలో పనిచేసి
రిటైర్ అయ్యారు. ఆయనకు తెలుగంటే ప్రాణం. ‘మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడండి, లేదా
పూర్తిగా తెలుగులో మాట్లాడండి, అంతేకాని ఇంగ్లీష్ తెలుగు కలిపి సంకరం చేయొద్దు’ అనేవారు.
‘నా వైఫ్’ అని ఏదైనా చెప్పబోతే ఆయనకు
చర్రున కాలేది. ‘నా వైఫ్ ఏమిటి ఛండాలంగా, మా ఆవిడ అని హాయిగా అనొచ్చుగా’ అనేది ఆయన వాదన.
అలాగే ‘సతీమణి’ అనే పదం పట్ల
కృష్ణారావు గారికి కొన్ని అభ్యంతరాలు ఉండేవి.
‘సతీమణి అంటే సతులలో మణి అని అర్ధం. రుక్మిణి
కృష్ణుడి సతీమణి. ఆయనకున్న అష్ట సతుల్లో ఆవిడ మణి అని. పలానా వారి సతీమణి అని
వార్తల్లో చెబితే తప్పు అర్ధం వస్తుంది, ఆయనగారికి ఇంకా వేరే భార్యలు వున్నారని.
అలా కాకుండా పలానా వారి భార్య’ అని రాయమనేవారు.
లేబుళ్లు:
సతీమణి అంటే....... భండారు శ్రీనివాసరావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)