పెసిమిజం అనుకోకండి. నిజంగా రేపనేదే లేదు. నిన్న చరిత్ర. నేడు నిజం. రేపు
అనుమానం.
మా ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చారు. నిజంగా ఆయన
అన్నింట్లో పెద్దమనిషే. సందేహం లేదు. రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు వుంది. పిల్లల
పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు వున్నాయి. ఒక రోజు ఆవిడ ఓ
మొగుడ్ని ఓ కోరిక కోరింది, డ్రాయింగు రూములో మాదిరిగానే బెడ్ రూమ్ లో కూడా ఓ ఏసీ
పెట్టించమని. ఓస్ అదెంత పని అనుకున్నాడు. ఓ షాపుకు వెళ్లి మాట్లాడాడు. మరుసటి రోజు
ఉదయం కల్లా పెడతానన్నాడు. విధి మరోలా తలచింది. ఎలాటి రోగంరొష్టు లేని ఆయన భార్య ఆ
రాత్రే విపరీతమైన గుండెపోటు వచ్చి కన్ను మూసింది.
మా ఇంట్లో ఏసీ గదిలో కూర్చోమంటే ఆయనకు మనస్కరించలేదు.
సెల వేసినట్టు భార్య అడిగిన ఆఖరు కోరిక గుర్తు చేసుకోవడమే ఆయనకు ఓ గుర్తులా మిగిలి
పోయింది.
‘రాత్రి వరకు కబుర్లు చెప్పిన మనిషి మరునాడు లేదు.
ఇక రేపు వుందనే నమ్మకం ఏమిటి? అది ఓ భ్రమ’ అన్నాడాయన.
నిజమే అనిపించింది.
అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని
అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా
వెంటనే చేయాలన్న మాట.
ఎందుకంటే రేపు మనది కాదు.