మీ టూ – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మీ టూ – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, అక్టోబర్ 2018, బుధవారం

మీ టూ – భండారు శ్రీనివాసరావు


యాభై ఏళ్ళ క్రితం కాబోలు ఓ కధ చదివాను.
ఆఫీసులో తన కింద పనిచేసే ఓ అమ్మాయిని అధికారి ఎన్నో ఆశలు చూపి లోబరుచుకోవాలనుకుంటాడు.
ఆ అమ్మాయి ఇలా అంటుంది.
“నేను పొద్దున్నే లేచి మూడు బస్సులు మారి ఆఫీసుకు వస్తాను. నాకు పెళ్లయింది. పిల్లాడు వున్నాడు. కుటుంబానికి ఆసరాగా వుండడం కోసం జీతం తక్కువయినా ఈ పనిచేస్తున్నాను. మీరు చెప్పే  విధంగా డబ్బు సంపాదించే ఆలోచన వుంటే నేనింత కష్టపడాల్సిన అవసరమే వుండేది కాదు, మీరే మా ఇంటికి వచ్చేవారు”
ఆఫీసరుకు కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.
 అది కధ కనుక సుఖాంతం అయింది అలా.
అర్ధశతాబ్దం గడిచినా పరిస్తితి మారలేదు అనడానికి ‘మీ టూ’ సంచలనం ఓ ఉదాహరణ. 
Image may contain: one or more people and text 


ఈరోజు బుధవారం మధ్యాహ్నం మోజో టీవీ ప్రత్యేక చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: కృష్ణ కుమారి, సామాజిక కార్యకర్త, నీహారిక రెడ్డి (న్యాయవాది) యాంకర్: మోజో కిషోర్. అంశం: Me too
LINK:
https://www.youtube.com/watch?v=k8_-9xLUcCI&t=464s