దేవాలయాల్లో సంప్రోక్షణ జరపడం అనేది
సాంప్రదాయంగా వస్తున్న వ్యవహారమే. నిజానికి గుళ్ళల్లో ఈ కార్యక్రమం ప్రతి రోజూ
జరుగుతుంది. ఏడాదికోసారి చేసే సంప్రోక్షణలలో మొత్తం గుడిని శుభ్రం చేస్తారు. ఇక
మహా సంప్రోక్షణ అంటే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ సమయంలో మూల విరాట్టును ఆవాహన
చేసి ఆ మూల మూర్తిలోని లోని దైవిక మహత్తును, దైవ శక్తిని గర్భగుడికి ఆవలగా ఏర్పాటు చేసిన మరో మూర్తిలోకి ప్రవేశపెడతారు.
సంప్రోక్షణ కార్యక్రమం యావత్తు పూర్తయిన తరువాత మళ్ళీ మూల విరాట్టులోకి ఆవాహన
చేస్తారు.
నాకు ఈ విషయాలు చెప్పిన ఒక పూజారి
గారికి వైఖానస సాంప్రదాయాల పట్ల అవగాహన వుందో లేదో తెలియదు. మామూలుగా అనుమాన
నివృత్తి కోసం అడిగినప్పుడు ఆ పండితుడు చెప్పిన వివరాలు ఇవి.
దీనికీ ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్న
వివాదానికీ సంబంధం లేదు.