నవ
తెలంగాణా నూతన స్వరూపం
ఆవిష్కృతమైంది. పది జిల్లాల తెలంగాణా ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణాగా విస్తృతమైంది.
విజయదశమి పర్వదినం ఈ వేడుకకు వేదిక
అయింది. రెండున్నర ఏళ్ళక్రితం ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం బాహ్య
సరిహద్దులు మార్చుకోకుండానే అంతర్గత స్వరూపాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చుకుంది.
పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం కొత్త ఆశలను
చిగురింప చేస్తోంది. ఆశలకు ఊపిరులూదాలంటే, చేసిన దానికన్నా చేయాల్సింది ఎక్కువ వుంటుంది. ప్రభుత్వానికి
నిజమైన సవాలు నేటి నుంచి మొదలవుతుంది. చక్కటి ప్రయత్నం మరింత చక్కటి ఫలితాలు
ఇచ్చేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత కేసీఆర్ సర్కారుపై వుంది.
కోడలు కంటానంటే వద్దనే అత్త వుంటుందా?
ప్రజలూ అంతే! ప్రభుత్వాలు మంచి చేయాలే
కానీ ఆహ్వానించి, ఆదరించే మంచితనం వారిలో
పుష్కలంగా వుంది.
శుభం భూయాత్!