ఫిబ్రవరి 29 నాలుగేళ్లకు ఒకసారి. ఫిబ్రవరి 9 మాత్రం ఏటేటా.
ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది.
చనిపోయినవారికి పుట్టిన రోజులు ఉంటాయా! పుట్టిన తర్వాతనే కదా వారు చనిపోయింది.
“మిస్టర్ హ్యాపీ బర్త్ డే”
“……………….”
అటునుంచి స్పందన లేదు. వుండదు, రాదు.
నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరు.
ఫిబ్రవరి తొమ్మిది. మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు.
1971లో పెళ్ళయినప్పటి నుంచి 2019 లో ఆమె చనిపోయేవరకు నలభయ్ ఎనిమిదేళ్లుగా నేను మా ఆవిడను పేరు పెట్టి ఎన్నడూ పిలవలేదు. మిస్టర్ అనే పిలిచేవాడిని.
ఎందుకంటే ఆవిడ నాకూ, నా చిన్న కుటుంబానికీ ‘మాస్టర్’ కాబట్టి.
కింది చిత్రాలు :
ఫోనులో పిలవాలని నేను
ఫోను పిలుపుకు అందనంత దూరంలో తాను.
(09-02-2025)
3 కామెంట్‌లు:
అన్నమయ్య 'నానాటి బతుకు నాటకము' గీతం లో ఇలా వ్రాశాడు.
------
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము
------
ఆత్రేయ
పోయినోళ్ళందరూ మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు
అని వ్రాశాడు.
ఆత్మలతో సంభాషణలను కలిపి మిమ్మల్ని వారితో మాట్లాడించే మీడియమ్స్ ఉన్నారటండీ
వారితో ప్రయత్నించి చూడండి ( హ్యూమన్ టెలీఫోన్స్ )
మీకు చాలా యాప్ట్ గా సరిపోయే పాట. సార్ మీకు సాంత్వన కలిగించే అద్భుతమైన పాట ఇది. ఎప్పుడు ఒంటరితనం అనిపించినా వినండి. లేదా పాడుకొనండి.
--------
ఎక్కడ వున్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా..
నీ సుఖమే నే కోరుతున్నా
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పని..
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా..
నీ సుఖమే నే కోరుతున్నా
పసిపాపవలే ఒడి జేర్చినాను
కనుపాపవలే కాపాడినాను
గుండెను గుడిగా చేసాను..
నువ్వుండలేనని వెళ్ళావు..
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా..
నీ సుఖమే నే కోరుతున్నా
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా..
నీ సుఖమే నే కోరుతున్నా
నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ..
కలకాలం చల్లగ వుండాలనీ..
దీవిస్తున్నా నా దేవినీ
దీవిస్తున్నా నా దేవినీ
ఎక్కడ వున్నా ఏమైనా
ఎవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా..
నీ సుఖమే నే కోరుతున్నా
కామెంట్‌ను పోస్ట్ చేయండి