ఉడుకునెత్తురున్న కొడుకు దుడుకు నాపాలని ఆపదలో పడనీయక దీపం చూపాలని వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రురుణం తీర్చి చల్లారిన ఒంటికి నీ వేడిరక్తమిచ్చి తోడైయిన నీ ముందు ఓడానా..గెలిచానా?
ఒకే తండ్రినుంచి రెండు జన్మలందుకున్నా తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా
పగలే గడిచింది..పడమర పిలిచింది వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో కాటుకనని ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
రాతిరి కరిగింది..తూరుపు దొరికింది కళ్ళు తెరిచి ఇపుడిప్పుడే ఉదయిస్తున్నాను అచ్చమైన స్వచ్చమైన తెలుపంటే ఏమిటో మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను
ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా ఒకరి కధలు ఇంకొకరికి సరికొత్త చదువురా
పాఠాలు ఎమైనా నీతి ఒక్కటే నాన్న చీకట్లు చీల్చడమే అయుధమేమైనా
2 కామెంట్‌లు:
😥🙏🏻
దయచేసి ఈ పాట వినండి సార్.
https://youtu.be/5ReaZZW-Vco?si=HHKYOAc97eoEnrJ3
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నన్న
కలిసొచ్చిన కాలానికి..నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా..
నేనే పసివాడినై నీ నీడ చెరుతున్నా
జీవితాన ప్రతి పాఠం చేదే అనుకున్నా
తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా
అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా..
నేనే గురుదక్షిణగా అంకితమవుతున్నా
ఉడుకునెత్తురున్న కొడుకు దుడుకు నాపాలని
ఆపదలో పడనీయక దీపం చూపాలని
వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రురుణం తీర్చి
చల్లారిన ఒంటికి నీ వేడిరక్తమిచ్చి
తోడైయిన నీ ముందు ఓడానా..గెలిచానా?
ఒకే తండ్రినుంచి రెండు జన్మలందుకున్నా
తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా
పగలే గడిచింది..పడమర పిలిచింది
వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను
కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో
కాటుకనని ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
రాతిరి కరిగింది..తూరుపు దొరికింది
కళ్ళు తెరిచి ఇపుడిప్పుడే ఉదయిస్తున్నాను
అచ్చమైన స్వచ్చమైన తెలుపంటే
ఏమిటో
మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను
ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా
ఒకరి కధలు ఇంకొకరికి సరికొత్త చదువురా
పాఠాలు ఎమైనా నీతి ఒక్కటే నాన్న
చీకట్లు చీల్చడమే అయుధమేమైనా
// “ జ్ఞాపకాల నిమజ్జనం జరిగే పనేనా!” //
జరిగే పని కాదు 😒🙏.
కామెంట్‌ను పోస్ట్ చేయండి