4, ఫిబ్రవరి 2019, సోమవారం

చట్టం ఒకటే చూసే చూపే వేరు


ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్ళు తలుపులు మూసుకున్నారు.
వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్ కు పలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.
ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత అసలు విషయం చెప్పారు, ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. వాళ్ళ మాటలో ఏమాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించక పోయినా ఏకాంబరం మాత్రం బతుకు జీవుడా అని బయట పడ్డాడు.
అదే రాజకీయ రక్ష రేకు వుంటే... మొత్తం కధే వేరుగా వుండేది.
ఈ దేశంలో చట్టాలు సామాన్యులపట్ల ఒక రకంగాం అసామాన్యుల పట్ల మరోరకంగా అమలవుతాయి.
ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు.  

1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

ఆర్ధిక శాస్త్రం గురించి మనదేశంలో చాలామందికి తెలియదని విజయ్ మాల్యా విదేశం నుండి ట్వీట్ చేసారు. మనకు చట్టం గురించి కూడా తెలియదు. మన సంసారాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తాము కానీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అని పరిశీలించము. సినిమాల్లో హీరోలు తమ కుటుంబానికి హాని జరిగితే గానీ వ్యవస్థ గురించి ఆలోచించరు. మనమూ అంతే !