15, నవంబర్ 2016, మంగళవారం

వ్యాధికంటే చికిత్స ప్రమాదం కాకూడదురోగికి తక్షణం శస్త్రచికిత్స అవసరం అని వైద్యుడు నిర్ణయించాడు. దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడాలని అనుకున్నాడు. రోగి బంధువులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్  లోకి తీసుకు వెళ్ళే ముందు బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. అవి అదుపులో వుంటే తప్ప లేదా  ఎంతో అవసరం అనుకుంటే తప్ప వైద్యుడు రోగి శరీరంపై కత్తి పెట్టడు.
ఇన్నేళ్ళ స్వతంత్ర  భారతం రుజాగ్రస్తం అయిపొయింది. నల్ల ధనం అనే మాయ  రోగం జాతి ఒళ్ళంతా పాకింది. ఈ స్తితిలో వున్న దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద నోట్ల రద్దువంటి శస్త్రచికిత్సలు అవసరమే. సందేహం లేదు. అయితే అందుకు జాతి సంసిద్ధంగా ఉందా! ఆ ‘ముందు’ జాగ్రత్తలు తీసుకోకుండా అడుగు ముందుకు వేయడం సబబేనా! ఇప్పుడు జరుగుతున్నది గమనిస్తుంటే జరిగింది సరయినదేనా అన్న అనుమానం కలిగితే దాన్ని సందేహించాలా!
రాజకీయ ‘శంక’ర్రావుల సంగతి పక్కన బెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.
ఉపసంహరణకు అవకాశం లేని బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోయింది.అది  గురితప్పకుండా చూసుకుంటూ,    సమస్యతో నేరుగా సంబంధం లేని వాళ్లపై దాని పరిణామాలు  పడకుండా చూడడం పాలకుల బాధ్యత.

       

5 కామెంట్‌లు:

Express Guru చెప్పారు...

Nice Article sir.
muggulua2z

Jai Gottimukkala చెప్పారు...

"రోగి బంధువులు అంగీకరించారు"

ఈ బంధువులు ఎవరు?

అజ్ఞాత చెప్పారు...

Hadthe rekeasebeen smooth the entire relese would have gone into the hands of the blackies

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gotimukkala - మీ సందేహం నాకు అర్ధం అయింది. ఇక్కడ ఒక సన్నివేశాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. బంధువులు అంగీకరించడం అంటే మొత్తం జనం ఒప్పుకున్నారని కాదు.

అజ్ఞాత చెప్పారు...

If the media people and arm chair experts keep quiet for 10 days, everything will be normal. No doubt, there is inconvenience. We have to bear with it for a few days.