27, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీ పరకాల ప్రభాకర్ చెప్పిన జోకు


ఈరోజు హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం పదేండ్ల పండగ జరిగింది. రెండు తెలుగు  రాష్ట్రాల సమాచార సలహాదారులు శ్రీయుతులు కే.రమణాచారి, శ్రీ పరకాల ప్రభాకర్, రెండు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ అధ్యక్షులు శ్రీ యుతులు వాసుదేవ దీక్షితులు, అల్లం నారాయణ హాజరయి ప్రసంగించారు.
ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సందర్భోచితంగా ఒక హాస్య గుళిక ఒదిలారు.

“వయస్సు పైబడిన తరువాత ప్రతి వ్యక్తి జీవితంలో  మూడు  బాగా పెరిగిపోతాయి. మొట్టమొదటిది, అందరికీ తెలిసిందే.  మతిమరపు. మిగిలిన రెండూ .....నా మతిమండా  మరచిపోయాను సుమీ!”

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...


ఫోటో లో ఉన్న వార్లలో భండారు వారు మాత్రమే యంగిజ్ఖాన్ లా ఉన్నారు :). యంగెస్ట్ ఓల్డ్ టైమర్ :)

జిలేబి