18, నవంబర్ 2015, బుధవారం

పేదవాడి గృహ ప్రవేశం

సూటిగా ......సుతిమెత్తగా ....... 
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 19-11-2015, THURSDAY) 
సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే కోరికే ఆదిమ మానవుడిని జనవాసాల నాగరిక జీవనం వైపుగా మళ్ళించింది. లేనిపక్షంలో పొదలు, గుహలకే మనిషి జీవితం పరిమితమై వుండేది.
సొంతిల్లు అనే కల కనని మనుషులు వుండరు. ఇల్లు అనేది నివసించడానికే కాదు మరణించడానికి కూడా అవసరం అని నమ్మే వాళ్ళు వున్నారు. ఒక ఇంటివాళ్ళు కావాలనే కోరిక పెంచుకునే విషయంలో  వున్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా లేదు. కలిగిన వాళ్ళు తమ విభవం కొద్దీ ఒకటికి మించిన ‘ఇళ్ళు’ కట్టుకుంటే, లేనివాళ్ళు కనీసం ఒక్క ‘ఇల్లు’ అన్నా సొంతం అవుతే బాగుండని కోరుకుంటారు. ఇదేమీ తీరని కోరిక  కాకపోయినా అంత తేలిగ్గా సాధ్యం అయ్యే విషయం కూడా కాదు. అందుకే ఇల్లంటే అందరికీ అంతటి మక్కువ.
అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో అత్యధికులు ఇళ్లు లేనివాళ్ళే. తల దాచుకోవడానికి కొందరు అద్దె కొంపల్ని నమ్ముకుంటే అసలా మాత్రం గూడు లేనివాళ్ళు కూడా పుష్కలంగానే వున్నారు. బహుళ అంతస్తుల సుందర హర్మ్యాల దాపునే చివికి జీరాడుతున్న గుడిసెలు కూడా కానవచ్చే దృశ్యం బహుశా మన దేశానికే పరిమితం కావచ్చు. ఏదో ఒక పాత సినిమాలో జమీందారు రైలెక్కడానికి మందీ మార్బలంతో స్టేషనుకు వస్తాడు. తాను ఎక్కాల్సిన మొదటి తరగతి బోగీకి ఆనుకుని సామాన్యులు ప్రయాణించే సాధారణ బోగీలు వుండడం చూసి ఆ ఖామందుల వారికి ఒళ్ళు మండుతుంది. వెంటనే సెక్రెటరీని పిలిచి  ‘ఈ రైలుకు రెండో తరగతి బోగీలు తగిలించింది ఎవర’ని హుంకరిస్తాడు. ‘అయ్యా! రెండో తరగతి ఉంటేనే మొదటి తరగతికి గుర్తింపు, అందుకే ఆ ఏర్పాటు’ అని తెలివిగా జవాబిచ్చి అప్పటికి తప్పుకుని ఊపిరి పీల్చుకుంటాడు.
ఎంతో బాగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో కూడా ఇళ్ళు లేని నిర్భాగ్య దామోదరులు వున్నారు. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్డు పక్కన ‘హోమ్ లెస్’ అని చిన్న బోర్డు పెట్టుకుని ఇలాటి వాళ్ళు అక్కడక్కడా కానవస్తుంటారు. మూడేళ్ళ క్రితం తీసిన అధికారిక గణాంకాల ప్రకారం అమెరికా వంటి సంపన్న దేశంలో ఇల్లు లేనివాళ్ళ సంఖ్య సుమారు కాస్త అటూ ఇటూగా ఆరున్నర లక్షలు. అయితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువే అన్నది కొందరి వాదన. మన దేశంలో పేదలకోసం ఏటా లక్షల సంఖ్యలో ఇళ్ళు నిర్మిస్తున్నామని మన రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తుంటే విని ఆ దేశాల వాళ్ళు  నోళ్ళు వెళ్ళబెట్టడానికి కారణం వుంది. మన దగ్గర పేదవాడి ఇల్లు అంటే నాలుగు మట్టి గోడలు, పైన తాటాకు కప్పిన పూరి పాక అని.  కానీ  అభివృద్ధి చెందిన దేశాల్లో ‘ఇల్లు’ అంటే ఆ  లెక్క వేరు.
బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు  టి. అంజయ్య.

రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.

పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ పాత  రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్ని కట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగా అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకం అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు, లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత కొన్నేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడు చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.
దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండినవాడు, కడుపు మండినవాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.


(ఐ.డీ.హెచ్.కాలనీ)

ఈ నేపధ్యం ఎందుకంటె గత వారం తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఎన్నికల వాగ్దానాల అంబుల పొదిలోని ఒక ప్రధాన అస్త్రానికి పదునుపెట్టి ప్రదర్శించారు. బడుగులకో గూడు ఏర్పాటు చేయాలనే సదుద్దేశ్యంతో కేసీఆర్ రెండు పడకల ఇంటి పధకానికి తొలి రూపం ఇచ్చారు. హైదరాబాదులోని ఐ.డీ.హెచ్. కాలనీలో ఏడాది క్రితం తానే శంకుస్థాపన చేసిన 396 రెండు పడక గదుల  ఇళ్ళ కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి తిరిగి తన చేతుల మీదుగానే ప్రారంభించి, బలహీన వర్గాల గృహ నిర్మాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీసారు. అంతకుముందే  నిర్మాణదశలో కాలనీని  సందర్శించిన గవర్నర్ నరసింహన్, ఆ ఇళ్ళను చూసి ముచ్చట పడ్డ విషయం గమనార్హం. బడుగులకు నాలుగు గోడలు కలిగిన ఓ పూరి పాక అప్పగించి చేతులు దులుపుకునే పాత పద్దతికి మంగళం పాడుతూ కేసీఆర్ చేపట్టిన ఈ పధకం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కాలనీని ఒక పర్యాయం పైనుంచి పరికిస్తే ఒక సంపన్న కాలనీని చిన్నదిగా చేసి చూసినట్టుగా అనిపిస్తుంది. అలాటి సౌకర్యాలను ఈ కొత్త కాలనీలో కల్పించారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయిన వారు ఆ ఇళ్ళను చూసి ఇటువంటి ఇల్లు తమకూ వుంటే యెంత బాగుంటుందని అనుకునే వుంటారు. అంత చూడముచ్చటగా ఉందా కాలనీ. ఆ విధంగా తన ఎన్నికల వాగ్దానంలో ఒక దాన్ని పాక్షికంగా అయినా అమలు చేసి చూపించిన ఘనత కేసీఆర్ కి దక్కింది.
అయితే ఇంతటితో ప్రభుత్వం బాధ్యత తీరిపోలేదు, సరికదా మరింత పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసినా తెలంగాణా కొత్త రాష్ట్రంలో ఇంటి వసతి లేని పేదల సంఖ్య లక్షల్లో వుంది. రెండు పడక గదుల ఇళ్ళు ఏటా అరవై వేలు కట్టాలన్నది ప్రభుత్వ యోచన. మూడువందల ఇళ్ళు కట్టి చూపడానికి, నిర్మాణ వ్యవధి ఏడాదే అయినా మొత్తం మీద వాగ్దానం కొంతమేరకయినా నెరవేర్చడానికి   ఏడాదిన్నర పట్టింది.  ఈలెక్కన లక్షల ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు పూర్తికావాలి? దానికి తగ్గట్టు, ఈ కొత్త కాలనీ నిర్మాణంతో పేదల కళ్ళల్లో కొత్త ఆశలు చిగుళ్ళు వేస్తున్నాయి. తమకూ సర్కారు అటువంటి ఇల్లు ఎప్పుడు కట్టించి ఇస్తుందా అనే ఎదురు చూపులు పెరుగుతున్నాయి.
అలాగే,  ఇల్లు కట్టించి, ఇంటి తాళాలు అప్పగించగానే పని పూర్తి అయినట్టు కాదు. కాలనీల నిర్వహణ సంపన్నులకే పెనుభారంగా మారిపోతున్న ఈ రోజుల్లో రెక్కాడితే కాని డొక్కాడని ఆ బడుగుల కాలనీలను కనిపెట్టి చూసేదెవరు? కొందరికి వచ్చి అందరికీ రాకపోతే, రానివారిలో కలిగే అసహనాన్ని తీర్చేదెవరు?
సరే! ఈ అనుమానాలని కాలమే తీర్చాలి. మొత్తం మీద మొదటి అడుగు పడింది. కేసీఆర్ తన సొంత ఇంటి పండుగలా ఈ పేదల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తిచేసారు. ఇల్లు అలుకగానే పండుగ కానట్టు ఈ పేదల గృహ ప్రవేశ పధకం ఎలాటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళగలిగితే, రెండు రూపాయల బియ్యం అనగానే జనాలకు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చినట్టు, రెండు పడక గదుల ఇల్లు అనగానే తటాలున గుర్తు వచ్చేది కేసీఆర్ పేరే అవుతుంది.     (18-11-2015)            
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  


9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

డబల్ బెడ్ రూం ఇళ్ళు కట్టడం కాదు కొశ్చను! అసలు వాళ్ళకి ఎంతమందికి చేరిఉంటాయన్నదే పాయింటు. :)

Jai Gottimukkala చెప్పారు...

కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద 2.3 లక్షల ఇళ్ళు మంజూరు చేయగా అందుట్లో సింహభాగం (1.9 లక్షలు అనగా 85%) ఆంధ్రకు ఇచ్చి తెలంగాణాతో సహా మిగిలిన రాష్ట్రాలను చిన్నచూపు చూసింది. ఈ వివక్ష గురించి ఎవరూ మాట్లాడరేం?

అజ్ఞాత చెప్పారు...

తొక్కలో ముక్కలా ,

ఏందీ వివక్ష్నా? పెపెంచకంలో ధనవంతమైన స్టేట్, 400 ఏళ్ల నుంచి సిరిసంపదలతో అలలారుతున్న స్టేట్ కు యోజన ఎందుకో జరజెప్పి అప్పుడేడువు. అయినా బోడి ఆంధ్రప్రదేశ్ తో నీకు పనేంది నీ బంగారు తెలంగాణా చూసి మురిసిపోక.

అజ్ఞాత చెప్పారు...

ఏడుపుగొట్టు వెధవల్లారా ఆదాయం, ఆస్తులు మొత్తం దొబ్బి, అప్పులు మాత్రం జనాభా లెక్కన పంచండి అన్నప్పుడు ఎవడి సంక నాకుతున్నావ్ . నీ లాంటి గుడుంబా, గోచీ గాళ్ళకి ఆ ఇళ్ళే ఎక్కువ. ఇంకా ఎంత కాలం ఏడుస్తావ్. కష్టపడి పని చెయ్యడం నేర్చుకో. పక్క వాడు కష్ట పడి అభివృద్ది చేసినదాన్ని ఎలా దోచెద్దామా అని కాదు.

అజ్ఞాత చెప్పారు...

ఎవడి సంకనాకి పరీక్షలు పాసైతరో గాని ఈ ఆంధ్రా యెధవలకు ఆస్తులు, అప్పులు ఎలా పంచుతారో కూడా తెలియక పొయే!!!

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

భండారువారూ,
ఈ‌ టపాకు వచ్చిన అఙ్ఞాతల వ్యాఖ్యలేవీ కూడా హుందాగా లేవు. దయచేసి వాటిని తొలగించండి.

అజ్ఞాత చెప్పారు...

@ అజ్ఞాత @ 21 నవంబర్, 2015 11:33 [PM]

నువ్వు కరెక్ట్ బ్రదర్! నువ్వస్సలు తగ్గొద్దు!!

అక్కడ తెలంగాణాలో పదివేల గుడంబా గోచిగాళ్ళుంటే, ఇక్కడ మనకు లక్షా తొంబై వేల మంది గోచీ కూడా లేని కాపుసారా గాళ్ళున్నారు, కాబట్టి ఆ యిళ్ళు మనకివ్వడమే కరెక్ట్! నువ్వు ఇదే రేంజిలో ఫైట్ చెయ్యి! పనిలో పనిగా మన ఫ్యాక్షనిస్టు గాళ్ళకు, ఆకు రౌడీ గాళ్ళకు, సూదిపోటు గాళ్ళకు కూడా ఇళ్ళు కావాలని ఎంకయ్యని అడుగు.

అజ్ఞాత చెప్పారు...

ఈ శ్యామలీయం పంతుల్ను ఎవడుబడితే వాడు ఎందుకు తిడతారో అర్ధమయ్యింది. ఏడ పడితే ఆడ దూరుడే ఇదేం దురదొ. తొక్కలో ముక్కలగాడి అబద్దాలకి వత్తాసు పలుకుతూ నిజం చెప్పే వాళ్ళ భాష బాలేదని కూసుడు.

ఆంధ్రోల్ల మీద ఏడ్చే అజ్ఞాత : ఆంధ్రోల్లు నాకే సంకలు కాబట్టి నీకే కాదు ఎవడికీ తెలీదు. కానైతే మీరు నాకే నాలుగు సంకలు మాత్రం పబ్లిక్ రా గుట్లే. సంకలేనా ఇంకా ఏమన్నా కూడా నాకుతురా దొంగ చాటుగా అందుకే మీరు 10000 అడిగితే అయ్యే ఇచ్చారన్న నిజం దాచి ఈడ వదురుతున్నావ్.


@నువ్వు కరెక్ట్ అని ఎకసక్కేలాడే అజ్ఞాత సాల్లే నీ దొంగ ముసుగు యవ్వారం. పక్క బ్లాగులో పేరు తో డిసకన్ బానే చేత్తాన్నావుగా. ఈడ ఆంధ్రా ముసుగెందుకు నీకు. నీ ఎదవేసాలు ఆపు.