21, ఆగస్టు 2011, ఆదివారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు – 3 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు – 3 - భండారు శ్రీనివాసరావు


‘ధాం’పత్యం!


సిగరెట్లు తాగడం నిషిద్ధం
అనే శ్రీమతితో రోజూ ఓ యుద్ధం
చేస్తూ వెడితే నా శ్రాద్ధం

అన్యోన్యత అన్నది చక్కటి అబద్ధం


(ఆంధ్ర జ్యోతి, జూన్ 5,1975) 


మాణి౦గ్ వీక్ నెస్ఉదయం తొమ్మిది గంటలకల్లా

ప్రతి సెంటర్లో అందమయిన బొమ్మల్లా
నిలబడే అమ్మాయిలనల్లా
ఊడ్చుకుపోయే ఉమెన్స్ కాలేజి బస్సు తో ఎల్లా!


(ఆంధ్ర జ్యోతి జూన్ 8,1975)

కార్టూనిస్టులకు, ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు  

2 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

ఏమిటండీ మీరు కూడానూ. సరే! సరే!! 1975లో వ్రాశారా ఇదీ OK

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శివరామ ప్రసాద్ కప్పగంతు- ప్రస్తుతం విజయవాడలో ఒక ఆసుపత్రిలో అపస్మారకస్తితిలోవున్నఆనాటి ఆంధ్ర జ్యోతి ఎడిటర్ శ్రీ నండూరి రామమోహనరావు గారు ఆ రోజుల్లో నా మీద అవ్యాజమైన ప్రేమతో నాచేత ప్రతిరోజూ ఎడిట్ పేజీలో నాలుగు వాక్యాలు కలిగిన ఈ వాక్టూన్లు (గీతతో గీసేవి కార్టూన్లు రాతతో రాసేవి వాక్టూన్లు అని కవి హృదయం) రాయించారు. ఏ రచన అయినా కాల ధర్మాన్ని అనుసరించే సాగుతుంది.ఇప్పుడు రాయమన్నా రాయలేము.'ఏమిటండీ మీరు కూడానూ'అని నేనయినా అంటానేమో- భండారు శ్రీనివాసరావు