రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఎన్నికల యుద్ధం రాజకీయ పార్టీల మధ్యనా లేక కొన్ని పత్రికల నడుమా?
4, మే 2014, ఆదివారం
ధర్మ సందేహం
రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఎన్నికల యుద్ధం రాజకీయ పార్టీల మధ్యనా లేక కొన్ని పత్రికల నడుమా?
కుడి ఎడమైతే....
సీమాంధ్రలో తొలి దశ పోలింగు జరిగి, రెండో దశ తెలంగాణా ప్రాంతంలో జరిపివుంటే రాజకీయ నాయకుల ప్రసంగాలు యెలా వుండేవో ఆలోచిస్తే తమాషాగా అనిపిస్తుంది.
లేబుళ్లు:
కుడి ఎడమైతే....,
AP elections
2, మే 2014, శుక్రవారం
పత్రికా స్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు - భండారు శ్రీనివాసరావు
అవి ఎమర్జెన్సీ రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు దయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’
పత్రికా స్వేచ్చపట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.
ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికా స్వేచ్చకు భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్చ అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.
నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం – అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ‘ఎడిట్’ చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో ‘పత్రికా స్వేచ్చకు’ పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రా యించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ‘ఎడిటోరియల్ పాలసీ’కి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగావున్నప్పుడు వారి పత్రికలలో ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ‘ఎడిటోరియల్ పాలసీ’ అంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం – ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికా స్వేచ్చకు అర్ధమేముంటుంది?
ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక – సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.
“అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.
‘అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు ఎదురుగా ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి”
లేబుళ్లు:
పత్రికా స్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు
29, ఏప్రిల్ 2014, మంగళవారం
'ఒరేయ్ నేను శారదని....'
క్షమించాలి నేను గీసుకున్న గీతను నేనే దాటి వస్తున్నందుకు. కానీ సరయిన కారణం వుంది. ఇందులో నాకు రాజకీయం కనబడలేదు. ఈ ఫోటోలో వున్నది మా రెండో అక్కయ్య. ఆవిడకు వోటు ఖమ్మంలో వుంది. కానీ మూడు నెలల క్రితం వాళ్ల అబ్బాయి దగ్గరకు వచ్చి ఆరోగ్యకారణాల రీత్యా హైదరాబాదులోనే వుండిపోవాల్సివచ్చింది. రేపు ఇక్కడ వోట్ల రోజు అన్న సంగతి తెలుసుకుని ఈ రోజు పొద్దటి నుంచి అందర్నీ ఫోనులో పలకరించి వోటు వేసి రమ్మంటోంది. అంతే కాదు వేసి వచ్చిన తరువాత ఆ విషయం మళ్ళీ ఫోను చేసి చెప్పమని మాట తీసుకుంటోంది. తొంభయ్ ఏళ్ళ వయస్సులో ఆవిడ పడుతున్న ఆత్రుత చూసిన తరువాత ఇక దీన్ని షేర్ చేయాలన్న ఆత్రుత నాలో పెరిగిపోయింది. అందుకే వొట్టు తీసి గట్టున పెట్టేసాను.మన్నించాలి. - భండారు శ్రీనివాసరావు
మా మేనకోడలు భండారు రేణు సుధ కధనం:
ఫోను కలపవే చిన్నమ్మాయ్!
" పొద్దున్నే లచ్చుబాబు నుంచి ఫోను. ఒక్కసారి వచ్చివెళ్ళవే అమ్మ అడుగుతోంది"
'ఆర్చుకుని తీర్చుకుని జూబిలీ హిల్స్ నుంచి బయలుదేరి వెళ్లేసరికి పదకొండు దాటింది. అమ్మ కిందటి నెలలోనే ఖమ్మం నుంచి హైదరాబాదు పటాన్ చెర్వు సమీపంలో వున్న మా చిన్నన్నయ్య ఇంటికి వచ్చింది. తొంభయ్ ఏళ్ళ మనిషిని అలా కదిలించడం నిజంగా సాహసం అనిపించింది కాని తప్పలేదు. మేముంటోంది జూబిలీ హిల్స్ లో. వారానికో పది రోజులకో వెళ్ళి చూసి వస్తుంటాను. ఎర్రటి ఎండలో పడివచ్చానని ఇంట్లో అంతా అనుకుంటుంటే అమ్మ మాత్రం తాపీగా 'ఫోను కలపవే చిన్నమ్మాయి' అంటోంది. అప్పటికే మా లచ్చుబాబు అన్నయ్య, గాయత్రి ఒదినె, వాళ్ల పిల్లల వరస అయిపోయినట్టుంది. ఆవిడ మంచం మీద కూర్చుని, హైదరాబాదులోని చుట్టపక్కాలు అందరికీ ఫోను కలిపి ఇవ్వమంటుంటే ఏమిటో అనుకున్నాను. తీరా చూస్తే. ఈ వయస్సులో ఎవరయినా అలా చేస్తారా అని అనిపించింది కూడా.
ఆవిడ పుట్టింది కాంగ్రెస్ వాదుల ఇంట్లో. మెట్టింది కాంగ్రెస్ కుటుంబాన్ని. పెళ్ళయిన కొత్తల్లోనే భర్త అంటే మా నాన్నగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారు, స్వాతంత్ర సమర యోధుడిగా, గర్భిణి అయిన అమ్మను వొదిలి పద్దెనిమిది మాసాలు జైల్లో వున్నారు. తొలి చూరు బిడ్డని పుట్టిన వెంటనే చూసుకునే అదృష్టం కూడా లేదు. జైలు నుంచి వచ్చిన ఎన్ని నెలలకో కళ్ళారా చూసుకున్నారు. స్వతంత్రం వచ్చిన దరిమిలా మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి క్రితంసారి ఎన్నికల వరకు దేన్నీ విడిచిపెట్టకుండా ప్రతిసారీ వోటు వేసి రావడం మా అమ్మకు అలవాటు. ఈసారి తనకు వోటు లేని హైదరాబాదులో వున్నప్పుడు ఈ వోట్ల పండుగ వచ్చిపడింది. వోటు వేయాలని ప్రాణం యెంత కొట్టుకులాడిపోతున్నా చేతకాని స్తితి. వీలులేని పరిస్తితి. అందుకని కొడుకునీ, కోడల్నీ, మనుమల్నీ పక్కన కూర్చోపెట్టుని అందరికీ ఫోన్లు కలపమని చెబుతూ, 'వొరేయ్ నేను శారదని, రేపు మరిచిపోకుండా వోటు వేసి రండి. వేసి వచ్చిన తరువాత నాకు ఫోను చేసి చెప్పండి.' అంటోంది.
ఇదంతా వింటూ నాకు కళ్ళు తిరిగాయో తెలియదు కాని తెరిపిళ్ళు పడ్డాయి. - భండారు రేణు సుధ
మా మేనకోడలు భండారు రేణు సుధ కధనం:
(శ్రీమతి కొలిపాక శారద)

'ఒరేయ్ నేను శారదని....' VOTE IS DUTY"
28, ఏప్రిల్ 2014, సోమవారం
తాత్కాలిక విరామం
బ్లాగర్, ట్విట్టర్, ఫేస్ బుక్ సయితం ప్రభావవంతమైన సోషల్ మీడియా
అయినందువల్ల ఈరోజు సాయంత్రం ఆరుగంటల నుంచి
ఎల్లుండి ముప్పయ్యవతేదీ సాయంత్రం పోలింగు ముగిసేవరకు రాజకీయ సంబంధమైన వార్తలు,
వాటిపై వ్యాఖ్యలు, లేదా రాజకీయ కార్టూన్లు షేర్ చేయడం, లేదా వాటికి వ్యాఖ్యానాలు జత
చేయడం, ఇతరులు పోస్ట్ చేసిన రాజకీయ
అంశాలపై స్పందించడం మొదలయిన వాటన్నిటికీ దూరంగా వుండాలని
నిర్ణయించుకున్నాను.ఇది నాకు నేనుగా స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయం.- భండారు
శ్రీనివాసరావు
27, ఏప్రిల్ 2014, ఆదివారం
ఏ నిమిషానికి ఏమిజరుగునో ........
మంథా భానుమతి గారు 'హ్యాపీ మూమెంట్స్' రాయడం
మొదలు పెట్టిన తరువాత అలా అందరూ తలా ఓ చేయివేస్తే అంతా హాయిగా చదువుకోవచ్చు కదా
అనిపించింది. కానీ మళ్ళీ ఆవిడే రాశారు తెలిసిన వాళ్ళెవరో పోయారు, విషాద వార్తను
పంచుకోవాల్సివచ్చిందని. పోతే, మా కధ.
ఆదివారం అన్నీ లేటే! కాఫీలు టిఫిన్లు.
వంటావిడ వచ్చి చేసిన ఇడ్లీలు తిని, పొద్దున్న (ఛానళ్ళ
కోసం) చదివిన పత్రికల్నే మళ్ళీ తీరిగ్గా చదవడానికి గదిలోకి వెళ్లాను. మా ఆవిడ పూల
కుండీల్లో నీళ్ళు పోశారో లేదో చూడడానికని బయటకు వెళ్ళింది. మావాడు సంతోష్ పెట్టిన టిఫిన్ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా
'వాట్సప్' లో మునిగితేలుతున్నాడు.
ఇంతలో భళ్ళున చప్పుడు. తలుపులు విరిగి విసురుగా
దూరాన పడ్డ శబ్దం. బయటకు వచ్చి చూస్తే వంటిల్లు రణరంగంలా వుంది. కిచెన్ ప్లాట్
ఫారం కింద గ్యాస్ క్యాబిన్ తలుపులు దూరంగా పడివున్నాయి. సిలిండర్ రెగ్యులెటర్
నుంచి మంటలు వస్తున్నాయి. మావాడు మంచినీళ్ళబాటిళ్లలోని నీళ్ళతో ఆ మంటలపై
చల్లుతున్నాడు.
అవి ఓ పట్టాన కంట్రోల్ కావడం లేదు. ఎలారా అని
అనుకుంటున్న సమయంలో 'లక్కు' అనేది మాకూ , జరగబోయే బీభత్సానికి నడుమ అడ్డుగోడలా
నిలిచింది. మంటలు ఆరిపోయాయి. సిలిండర్ తీసి బయట పడేశాము.
ప్రస్తుతం మా ఆవిడ పర్యవేక్షణలో సంప్రోక్షణ
జరుగుతోంది.
మావాడు కిచెన్ కు సెలవు ప్రకటించాడు. బహుశా ఈ పూట
మధ్యాహ్నభోజనం బయట హోటల్లోనేమో!
కధ సుఖాంతం
లేబుళ్లు:
ఏ నిమిషానికి ఏమిజరుగునో ........
26, ఏప్రిల్ 2014, శనివారం
?????????
లేబుళ్లు:
????????? అసెంబ్లీ రద్దు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)