ఎవరికోసం ? టీవీల్లో తుపాను ప్రకటనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎవరికోసం ? టీవీల్లో తుపాను ప్రకటనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, అక్టోబర్ 2018, గురువారం

ఎవరికోసం ? – భండారు శ్రీనివాసరావు



తుపాను సృష్టించిన నష్టాలు, సహాయక చర్యలపై టీవీలో చర్చ జరుగుతోంది.
“తుపాను తీరం దాటిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి చెప్పిన వివరాలు విన్నారు కదా! అక్కడ పరిస్తితి భీభత్సంగా వుంది. పెనుగాలులకు చెట్లు కూకటి వేళ్ళతో కూలిపోయాయి. రోడ్లు  భయంకరంగా దెబ్బతిన్నాయి. రవాణా పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలిగి ఆ ప్రాంతాలన్నీ అంధకారబంధురంగా మారాయి. సాధారణ పరిస్తితులు తిరిగి నెలకొనడానికి ఎంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు.  ఈ నేపధ్యంలో సహాయక చర్యలు ఎలా వుండాలి? అక్కడి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే దానిపై ఇప్పుడు చర్చిద్దాం”
అన్నాడు యాంకరు.
“చర్చించి ఎవరికి ఉపయోగం? చర్చిస్తున్న ప్రాంతంలో తుపాను ప్రభావం లేదు. ప్రభావం చూపించిన చోట కరెంటే లేదని మీ విలేకరే చెప్పాడు. కరెంటు లేకపోతే పనిచేసే టీవీలు ఇంకా వినియోగంలోకి రాలేదు. మరెవరికోసం ఈ చర్చ?”
కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకుడి సందేహం.