2, ఏప్రిల్ 2020, గురువారం

రాజుగారి పెద్ద భార్య చిన్న భార్య


“మీరు పాత కాలంవాళ్ళు. ఇవన్నీఈ  రోజుల్లో చాలా  మామూలు. తేలిగ్గా తీసుకోవాలి” అన్నాడు ఓ మిత్రుడు.
నిజమే. కానీ ఆ మిత్రుడు అన్నట్టు పాత కాలపు వాసనలు కదా! త్వరగా వదలవు.
ఈ మధ్య ఫేస్ బుక్ లో  ప్రతి విషయంలో అనవసరమైన నిందారోపణలు, వ్యాఖ్యలు దర్శనమిస్తున్నాయి.
చిన్నప్పుడు మా బామ్మ అనేది, ఇష్టం లేని వాడి పాపిడి వంకర అని. అలాగే వున్నాయి ఇవి కూడా.
ఏదో ఎవరూ అనుకోని  తెలియని ఉత్పాతం వచ్చి పడింది. అందరూ తలో చేయీ వేస్తున్నారు. కానీ వీళ్ళ చేతులు ఊరుకోవు కదా! సోషల్ మీడియాలో సన్నాయి నొక్కులు మొదలయ్యాయి.
“టాటా సాయం చేస్తే బిర్లా ఎందుకు చేయడు? (బిర్లాలు చేసారో లేదో నేను పత్రికల్లో చదవలేదు, ఎందుకంటే పత్రిక మొహం చూసి రమ్యమైన రెండో వారం నడుస్తోంది)
“హీరోలు ఒక్కళ్ళేనా హీరోయిన్లకు బాధ్యత లేదా”   
“అందరూ కోట్లు లక్షలు ఇస్తుంటే ఈయనకు ఏమైంది వేలతో సరిపుచ్చాడు”
 “ఇంకా వాళ్ళు మొదలు పెట్టలేదేమిటి? గతంలో ఏదైనా ఉపద్రవం వస్తే చాలు చందాల వసూలుకు జనం మీద పడేవాళ్ళు. వసూలు చేసిన వాటికి ఇంతవరకు లెక్కా డొక్కాలేదు”
“ఈ ముఖ్యమంత్రిని నమ్మి వందల కోట్లు ఇస్తున్నారు, అదిగో ఆ ముఖ్యమంత్రిపై నమ్మకం లేక ఎవరూ చేయి విదల్చడం లేదు”
అంటే ఏమిటి? రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనేనా?
ఈ విషమ సమయంలో ఇవేనా మనం మాట్లాడుకోవాల్సింది.
వెనక చైనా యుద్ధం అప్పుడు దేశ రక్షణ నిధికి విరాళాలు పోగుచేస్తుంటే మా రెండో అక్కయ్య కూతురు శాంత, అప్పటికి చాలా చిన్నపిల్ల, తన చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి జోలెలో వేసింది. మా బావగారు ‘మంచి పనిచేశావ్ అమ్మాయి’ అని మెచ్చుకున్నారు. అంతే! అప్పటితో మరచిపోయారు. ఇరుగూ పొరుగు వాళ్లకి కూడా చెప్పుకోలేదు.   

7 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ఒక్కోసారి ప్రజానీకానికి కామన్ సెన్సు మిస్ అవుతూ ఉంటుంది లెండి!

M KAMESWARA SARMA చెప్పారు...

సైలెంట్ గా సేవలు చేస్తే ఊరా పేరా. పబ్లిక్ లో నిలబడి పబ్లిసిటీతో చేయాల్సిందే దానమైనా, సేవైనా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అయ్యా, నేను చెప్పేది surgeon’s knife పద్ధతి అనుకోండి, మరేమైనా అనుకోండి కానీ మన దేశంలో సోషల్ మీడియాను ప్రభుత్వం వారు నిషేధిస్తే సగం దరిగ్రం వదులుతుంది అని నా గట్టి అభిప్రాయం. ప్రస్తుత కరోనా సమయంలో మాత్రమే కాదు, తరవాత కూడా .... ఎల్లప్పటికీ .... నిషేధించెయ్సాలి. టెలికాం శాఖ వారికి ఆదేశాలుచ్చి సోషల్ మీడియా ప్లాట్-ఫారాలు అన్నిటినీ భారతదేశంలో పని చెయ్యకూడదన్నట్లు block చేయించెయ్సాలి.

సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మేలు ప్రశ్నార్థకమే. దాని ద్వారా dissemibation అవుతున్న పనికొచ్చే సమాచారమా కనబడడం లేదు. ఎంతసేపూ వ్యక్తిత్వహననం చెయ్యడం. ప్రతివాడూ వైద్యుడే, ప్రతివాడూ అన్ని విషయాల్లోనూ నిపుణుడే, ప్రతివాడూ ఆధ్యాత్మిక గురువే, ప్రతివాడూ సనాతనధర్మ బోధకుడే. ఇవి కాక పనికిమాలిన / ప్రమాదకరమైన సెల్ఫీలు, వాటికి ఎన్ని లైక్ లు వచ్చాయో లెక్క పెట్టుకుని గొప్పలు చెప్పుకోవడం.

సామాజిక ప్రయోజనం లేని మీడియా సోషల్ మీడియా. తలుపులు వేసెయ్యండి.

sarma చెప్పారు...


ఇండియాలో ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఏమైపోవాలి?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వదంతులకు, ఆకతాయి మెసేజ్ లకు పుట్టిల్లు సోషల్ మీడియా.
రేపు ఏప్రిల్ 5న రాత్రి 9గంటలకు దేశంలో అందరూ ఇంట్లో లైట్లు ఆర్పేసి బయటకొచ్చి దీపాలు వెలిగించాలని మోదీ గారు పిలుపునిచ్చారు కదా. ఇవాళ వాట్సప్ లో మెసేజ్ .... ఏమనీ ... ఒక్కసారిగా అందరూ అలా లైట్లు ఆర్పేస్తే లోడ్ తగ్గిపోయి గ్రిడ్ కుప్పకూలిపోతుందని. అది చూసి ట్రాన్స్-కో సి.ఎం.డి గారు ఆ వార్తలో వాస్తవం లేదని హడావుడిగా ప్రకటన చెయ్యడం.

ఇది కాదె ఆకతాయితనం, ఇది కాదె బాధ్యతారాహిత్యం ! సదరు సందర్భం యొక్క గంభీరతను కూడా లెక్క చెయ్యకపోవడం. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ను దుర్వినియోగ పర్చడం.

మూసేస్తేనే ఉత్తమం.

అజ్ఞాత చెప్పారు...

Whether we like it or not, Social media represents the maturity of a society

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మన దేశానికి సంబంధించినంత వరకు lack of “maturity” అని పెట్టుకుంటే సరిపోతుంది.