9, జూన్ 2015, మంగళవారం

విజ్ఞప్తి

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై అధినాయకుల సవాళ్లతో కూడిన ప్రకటనలు విన్నప్పుడు , వాటిపై టీవీల్లో  చర్చిస్తున్నప్పుడు చాలా బాధ వేస్తోంది. ఆ బాధ ఇప్పుడు భయంగా పరిణమిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రెండింటికీ సమర్ధత ప్రాతిపదికా తీసుకుని ఆయా రాష్ట్రాల ప్రజలు ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికారం అప్పగించారు.  కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  మొదట్లో ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం అందరి గుండెల్లో నిండింది. అది ఏడాది గడవక ముందే ఇలా ఆవిరి అయిపోతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు  జనంలోకి చేరిపోయి వారు కూడా  రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు  మరింత బిగిసిపోకముందే ఉభయ ప్రాంతాల నాయకులు కళ్ళు తెరవాలి.  వ్యవహారాలు చేయిదాటిపోనివ్వకూడదు. నిజానికి ఇది బాధ్యతతో కూడిన కర్తవ్యం.  రెండు ప్రాంతాలలో వాతావరణం తేలిక పడే విధంగా వారి అడుగులు పడాలి. పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నాది ఇదే విజ్ఞప్తి.(భండారు శ్రీనివాసరావు)

(NOTE:Courtesy Image Owner)

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Let's hope so

Jai Gottimukkala చెప్పారు...

భండారు శ్రీనివాస రావు గారూ, మీరు తీసుకున్న వైఖరి ఎంతవరకు సబబో మీరే ఆలోచించాలి. కొందరు వ్యక్తుల మీద నేరారోపణలు జరిగాయి, కొంత సాక్ష్యం దొరికింది, విచారణ కొనసాగుతుంది. దీంట్లో రాష్ట్రాల మధ్య వివాదం ఎక్కడుంది?

ఒకవేళ వివాదం అంటూ ఉన్నా రెండు పార్టీల మధ్యే తప్ప రాష్ట్రాల ప్రమేయం లేదు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి దీనికి ప్రాంతీయత రంగు పులమడం రాజకీయవేత్తలు చేస్తే చేయోచ్చు తటస్తులమని చెప్పుకునే మీలాంటి వారికి తగునా?

BTW did you condemn Revanth Reddy's brazen crime?

hari.S.babu చెప్పారు...

@jai
BTW did you condemn Revanth Reddy's brazen crime?
My question to you
BTW did you condemn TRS's operation aakarsh?

అజ్ఞాత చెప్పారు...

@ Haribaabu
You know he is Gottimukkala :)

Jai Gottimukkala చెప్పారు...

@Haribabu Suranenii:

Firstly TRS akarsh, YSR akarsh, CBN akarsh (SPY Reddy, Geetha et al) are all the same to me. Are they different to you?

Secondly akarsh is different from a criminal caught red-handed but trying to brazen it out. Ask your yellow fever media to come up with a similar sting: I will criticize it more than you :)

Unknown చెప్పారు...

ఈ ఆకర్ష్ లు AP తెలంగాణాలో మాత్రమే కాదు, దేశమంతా ఉన్నాయి. కాని ఒక ఎమ్మెల్యే డబ్బులిస్తూ రెడ్‌హ్యాండేడ్‌గా పట్టు బడడం, ఒక ముఖ్యమంత్రి ఆడియో టేపులో అడ్డంగా దొరకడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దేశంలోనే మొదటిసారిగా రికార్డు సృష్టించారు.

YJs చెప్పారు...

ఈ ఆకర్ష్ లు AP తెలంగాణాలో మాత్రమే కాదు, దేశమంతా ఉన్నాయి. కాని ఒక ఎమ్మెల్యే డబ్బులిస్తూ రెడ్‌హ్యాండేడ్‌గా పట్టు బడడం, ఒక ముఖ్యమంత్రి ఆడియో టేపులో అడ్డంగా దొరకడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దేశంలోనే మొదటిసారిగా రికార్డు సృష్టించారు.//
లెస్స పలికితిరి.

దొరికాడు కాబట్టి దొంగ.
దొరకనంతవరకూ దొర.