5, జూన్ 2015, శుక్రవారం

కొన్ని ముదురు ఇంగ్లీష్ జోకులు"వెల్డింగ్ (అతుకు వేసేటప్పుడు) చేసేటప్పుడు ముందు రవ్వలు వస్తాయి. తరువాత అతుకు పెట్టిన రెండూ గట్టిగా అటుక్కుపోతాయి. అదే వెడ్డింగ్ లో ముందు ఇద్దరు వ్యక్తుల నడుమ బంధం ఏర్పడుతుంది. తరువాత ఆగకుండా రవ్వలు వస్తాయి"
"చుట్టూ చీకట్లు కమ్ముకుంటే తొలగించమని ముందు దేవుడ్ని ప్రార్ధించండి. ఫలితం లేనిపక్షంలో వెంటనే వెళ్ళి కరెంటు బిల్లు కట్టి రండి"
"ఎవడయినా భార్యకు కారు డోరు తెరిచిపట్టుకున్నాడు అంటే అతగాడికి కారు అన్నా కొత్తది కావాలి. భార్య అయినా కొత్తది అయుండాలి"   
"మనసు ఉద్రిక్తం కావడం, ఆందోళన కలగడం,  భయం వేయడం ఇవన్నీ  వేర్వేరు సందర్భాలలో అనుభవానికి వస్తాయి. భార్య కడుపుతో వున్నదని కబురు వింటే మనసు  సంతోషంతో ఉద్రిక్తం అవుతుంది. స్నేహితురాలు నెల తప్పిందని తెలిస్తే గాభరా, ఆందోళన తప్పవు. ఇద్దరూ గర్భం ధరించారన్న వార్త ఒకేసారి తెలిసింది అనుకోండి. ఇకచెప్పేది ఏముంది, గాభరా ఆందోళనా, భయం ఇత్యాదివన్నీ ఒకేసారి ఆవహిస్తాయి"
"గ్రామరు పీరియడ్ లో టీచరు పాఠం చెబుతూ చింటూని అడిగింది.
'ఈ పీరియడ్ కు వున్న ప్రాధాన్యత తెలుసా' అని.
చింటూ చెప్పాడు.
'సరిగ్గా తెలియదు కానీ మేడం, ఒకసారి ఇంట్లో ఈ మాట విన్నాను. మా చెల్లెలు అమ్మతో ఈనెల పీరియడ్ రాలేదని చెబుతోంది. అది విని మా అమ్మ స్పృహ తప్పింది. నాన్నకు గుండెపోటు వచ్చింది. మా డ్రైవర్ పత్తా లేకుండా పోయాడు'
చింటూ తండ్రిని అడిగాడు, నమ్మకానికి రహస్యానికి అర్ధం ఏమిటని. తండ్రి బదులు చెప్పాడు.

'నువ్వు నా కొడుకువి. ఆవిషయం నమ్మకంగా చెప్పగలను. అదిగో ఆ పక్కింట్లో నీ స్నేహితుడు వున్నాడు చూడు. వాడూ నా కొడుకే. కాని అది రహస్యం. పైకి చెప్పుకోలేను'  
NOTE: Image courtesy: Instant humour.com 

కామెంట్‌లు లేవు: