14, మే 2013, మంగళవారం

అవును ఆమె కేవలం ఆడదిఅవును ఆమె కేవలం ఆడది.
అయినా ఆమె ఒకరికి తల్లి, మరొకరికి భార్య, వేరొకరికి బిడ్డ, ఇంకొకరికి అక్క, చెల్లెలు
బహురూపాల్లో కానవచ్చే అరుదయిన మానవరూపం  
అబలగా కనిపించినా నిజానికి ఆమె మహాశక్తి
ధైర్యానికి మారు పేరు, స్థైర్యానికి ఇంటి పేరు
ఆమెకూ కోరికలున్నాయి
ఆమెకూ ఆశలున్నాయి
అయినా ఏవీ తన కోసం కాదు, అన్నీ తనవారి కోసం  
కార్యశూరత, కార్య దక్షత ఆమెకు పెట్టని ఆభరణాలు
నేర్పూ ఓర్పూ ఆమెకు కవచ కుండలాలు  
పొగడ్తకు పొంగడం,  తెగడ్తకు కుంగడం తెలవని జీవి
తెలిసినదల్లా ప్రేమను పంచడం, అనురాగాన్ని అందించడం   
ఆమె బలమల్లా భవిష్యత్తు గురించిన ఆశ
బతుకు బాగుపడకపోతుందా అనే పేరాశ  
జీవితంతో అలుపెరుగని పోరాటం
ఆమెకు నిత్యం ఓ చెలగాటం
కాని ఆ  పోరాట పటిమకు గుర్తింపు నాస్తి
అయితే, ఒకరి మెరమెప్పుల కోసం ఆరాటపడడం ఆమె రక్తంలో లేదు
ఆమెది నిష్కామ కర్మ
అందుకే ఆమె.......
జస్ట్
ఒక ఆడదిగా మిగిలిపోయింది (14-05-2013)
NOTE: Courtesy Cartoonist 

కామెంట్‌లు లేవు: