23, సెప్టెంబర్ 2010, గురువారం

కేబీ తిలక్ ఇకలేరు -భండారు శ్రీనివాసరావు

కేబీ తిలక్ ఇకలేరు    -భండారు శ్రీనివాసరావు
హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విమానాశ్రయానికి  బయలుదేరడానికి సిద్ధం అవుతున్న సమయంలో పిడుగులాటి దుర్వార్త తెలిసింది ‘తిలక్ గారు ఇక లేర'ని.

శ్రీ కేబీ తిలక్  
నిజానికి ఇది రాసే వ్యవధానం లేదు. కానీ ఆయనతో నాకున్న పరిచయం నన్ను వుండబట్టనివ్వడం లేదు. తెలుగు సినిమా పరిశ్రమకు కురువృద్ధుడయినా మా దగ్గర మాత్రం ఒక పిల్లవాడిలా వుండే వారు. తిలక్ గారు మా ఇళ్లకువచ్చి పోతుండేపోయేవారని చెబితే జనం ఒక పట్టాన నమ్మేవారు కాదు. జ్వాలా ‘తిలక్ జ్ఞాపకాలు’ రాస్తున్నప్పుడు తెలతెల వారుతూనే మార్నింగ్ వాక్ లాగా ఇంటికి వచ్చి కాఫీ తాగి తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని వెడుతుండడం నాకు తెలుసు. టీవీ చానళ్ళు రాకపూర్వమే – ఏరోజు వార్తలను ఆరోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ఒక చిరు ప్రయత్నంలో జ్వాలా,నేనూ, ఎమ్మెస్ శంకర్ ప్రధాన సూత్రదారులం. నాచేత నాలుగు ముక్కలు రాయించడానికి ఆయన ఎంతో ప్రయాసపడేవారు. ‘నీ వెంటబడి రాయించడం నా చేతకావట్లేదు. నీకంటే సినిమా రైటర్లే ఎంతో నయం’ అనేవారు. మా ముందు కూర్చున్నది ఎవరో కాదు - ఒకనాడు తన అద్భుత చిత్రాలతో తెలుగు చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన పెద్ద మనిషి అని తెలిసి కూడా మేము లైట్ తీసుకునేవాళ్ళం. అది మా అజ్ఞానం. మమ్మల్ని ఓపికగా భరించగలగడం ఆయన గొప్పతనం. వయస్సులో చాలా తేడా వున్నా – మాతో ఆయన చాలా పొద్దుపోయేదాకా గడిపేవారు. అహంకారం, అభిజాత్యం సుతరామూ లేని మనిషి. అంతటి పెద్ద మనిషితో, అంత పెద్ద మనసున్న ‘మహా మనీషి’ తో కొన్నేళ్లపాటు అతి సన్నిహితంగా మెలగగలిగిన నా జన్మ ధన్యమని భావిస్తూ ఆయనకు నిండు నివాళి ఘటిస్తున్నాను. – సియాటిల్ నుంచి శ్రీనివాసరావు
 

6 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

Very sad news. Bhumi Kosam was one of a kind movie from him! May his soul rest in peace

ramana చెప్పారు...

nijamu sreenivasaraogaru..thilak garu andarilo anthaga kalisi poyewaru....bhoomikosam na uddesamlo ayana best film.. maa mamagari ooru-kondrupadu, guntur zilla-kadha.muddubidda,eedu jodu,uyyala jampala, athaokintikodalu,kolletikapuram,dharmavaddi...varusaga.
arudra, pendyala, thilak great combination..add kongara jaggaiah, jamuna, gummadi, sreesree etc to his team....GREAT DIRECTOR, AND MAN..hyderabadlo tholi out door shooting -mla lo- moodukotla teluguvari mukkhya pattanam..:aanade habibulla road lo oka intlo shoot chesi thruvatha dabbing cheyatametc are his achivements--ramana -all india radio

karlapalem Hanumantha Rao చెప్పారు...

KB THILK గారిని గురించి ఈ వారం లో పెద్ద వాళ్ళ దగ్గరినుంచి వారి పర్సనల్ ఫీలింగ్స్ తెలుసుకోవటం ఇది రెండో సారి.జ్వాల గారి వ్యాసం ఆంధ్ర జ్యోతి లో ,ఆంధ్ర ప్రభ లో చదివిన తరువాత మీరు రాసిన ఈ చిరు వ్యాసం చూసాను.కె.బి. తిలక్ అనంగానే అందరికి ముందు గుర్తుకు వచ్చేది మా భూమి. నాకు మాత్రం వారి సినిమాల్లోనీ పాటలు.అచ్చమైన పల్లెవాసన వచ్చే ఆ పైరగాలి పాటల రాసానుభావాన్నిమాటల లో చెప్పబోతే నన్ను నేను లోటు పరుచుకున్నట్లే సార్! ఆ ప్రయత్నం నా బోటి వారికి అంత తేలిక కాదు.మీ బ్లాగ్ చూస్తున్నాను.ఎంజాయ్ చేస్తున్నాను.ముందు ముందు నా స్పందన తెలియచేస్తాను. కృతజ్ఞతలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

హనుమంతరావు గారికి
తిలక్ గారిని గురించి నలుగురితో పంచుకోతగిన అనుభవాలు ఎన్నో వున్నాయి. ఆ విషాదవార్త నా చెవిన పడ్డప్పుడు అమెరికాలోని సియాటిల్ లో వున్నాను. ఇండియా తిరిగి రావడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళబోతూ కాసేపు ఆగిపోయి కంప్యూటర్ ఓపెన్ చేసి తిలక్ గారి గురించి నాలుగంటే నాలుగు వాక్యాలు రాసి బయలుదేరాను. ఎందుకంటె నేను హైదరాబాద్ చేరేసరికి రెండురోజులు పడుతుంది. అప్పటిదాకా ఆగలేక పోయాను. వ్యాసానికి న్యాయం చేయలేకపోయినా(సమగ్రంగా రాయక) నా మనసుకు సమాధానం చెప్పుకోగలిగాను. నేను హైదరాబాద్ వచ్చిన దాకా తిలక్ గారి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగకపోవడం వల్ల ఆయనకు అంతిమ శ్రద్ధాంజలి ఘటించే అవకాశం లభించింది. అదే నా అదృష్టం. కృతజ్ఞలతో – భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks RAMA garu for your observations about late Shri Tilak.-Bhandaru SrinivasRao

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks maganti vansee mohan. i remember what i promised to you about AIR and i will do it-Bhandaru Srinivas Rao