7, ఫిబ్రవరి 2019, గురువారం

Media Avoiding Janasena Chief Pawan Kalyan Updates says Sr Journbalist B...

Mamatha Benerjee Vs Narendra Modi is CBI Attack Episode: Sr Editor Bhand...

Discussion On YCP Leader offers Bibe to Police Officers | Part - 1 | ABN...



బుధవారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో యాంకర్ చంద్రిక నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ ఆంజనేయ  రెడ్డి (బీజేపీ)

5, ఫిబ్రవరి 2019, మంగళవారం

KSR Live Show | YS Jagan Complaints to Centre on Chandrababu - 5th Febru...





ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీలో కే ఎస్ ఆర్ (కొమ్మినేని) లైవ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ వెంకటరెడ్డి (కాంగ్రెస్), శ్రీ రవిచంద్రారెడ్డి (వైసీపీ), సరే కోట సాయికృష్ణ (బీజేపీ).

4, ఫిబ్రవరి 2019, సోమవారం

చట్టం ఒకటే చూసే చూపే వేరు


ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్ళు తలుపులు మూసుకున్నారు.
వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్ కు పలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.
ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత అసలు విషయం చెప్పారు, ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. వాళ్ళ మాటలో ఏమాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించక పోయినా ఏకాంబరం మాత్రం బతుకు జీవుడా అని బయట పడ్డాడు.
అదే రాజకీయ రక్ష రేకు వుంటే... మొత్తం కధే వేరుగా వుండేది.
ఈ దేశంలో చట్టాలు సామాన్యులపట్ల ఒక రకంగాం అసామాన్యుల పట్ల మరోరకంగా అమలవుతాయి.
ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు.  

అపుడు ఔనంటే ఇపుడు కాదనిలే! ఇపుడు ఔనంటే అపుడు కాదనిలే!



ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు.
ఓ పదేళ్ళు వెనక్కి వెడదాం.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
మళ్ళీ ఓసారి ఆరేళ్ళు వెనక్కి వెడదాం!
2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.
జస్టిస్ ఆర్. ఎం. లోధా  గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.
‘సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’
కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.
అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి  సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో మంచి  ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన  సంగతి తెలిసిందే.
రెండేళ్ళ క్రితం సీబీఐ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.
ఉత్తర ప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ‘సమాజ్ వాది, బిఎస్ పిలను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. దాని పేరే  సీబీఐ’.  

అతి ముందు జాగ్రత్త

గత వారం మేము మా పత్రికలో పలానా వారు మరణించారని ప్రకటించడము, ఆ పలానా వారి మృతిపట్ల పలానా పలానా పెద్దమనుషులందరూ ప్రగాఢ సంతాపం వెల్లడించడము అందరికీ తెలిసిందే. దరిమిలా పలానావారు మరణించలేదనీ వారు తీవ్ర అస్వస్తతలో ఉన్నారనీ తెలిసి చింతించిన విషయమూ తెలిసిందే. పొతే పలానా వారు ఈసారి నిజంగా చనిపోయారని తెలియవచ్చింది. మావిలేకరులను పంపి ఆ వార్తను ధృవపరచుకోవడము కూడా జరిగింది. అయితే గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పలానా వారి మరణం పట్ల పలానా పలానా వాళ్ళందరూ సంతాప ప్రకటనలు జారీ చేసిన పిదపనే పలానా వారి మరణ వార్తను ఈసారి ప్రకటించాలని మా సంపాదకవర్గం నిర్ణయించింది.
ఇట్లు
సంపాదకుడు
పలానా పత్రిక