రోశయ్య గారు – కూరల కత్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రోశయ్య గారు – కూరల కత్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, డిసెంబర్ 2021, ఆదివారం

రోశయ్య గారు – కూరల కత్తి

 ఆ రోజుల్లో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రతిపక్ష నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి. రామకృష్ణుడు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు గురించి సుదీర్ఘంగా మాట్లాడి, ప్రభుత్వ పధకాల అమలుకు అవసరమయితే అప్పులు చేసినా తప్పులేదన్న అర్ధం ధ్వనించేలా వ్యాఖ్యానించారు. పైగా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునేందుకు అవకాశం వుందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

రోశయ్య లేచి ఇలా అన్నారు.

“అప్పులు అభివృద్ధి కోసం అంటున్నారు, ఇదేమి లాజిక్కో నాకు అర్ధం కాదు. పరిమితికి మించి ఓడీలు తీసుకుంటే నష్టపోయేది రాష్ట్రమే. అయినా వంటింట్లో కూరగాయలు కోసే  కత్తి వుందని మెడ కోసుకుంటామా!” అని చమత్కరించారు.   

తర్వాత సభ బయట విలేకరులతో ముచ్చటిస్తూ ఇంకా ఇలా అన్నారు.

‘కాఫీపొడుం, పంచదార అయితే ఏదో అనుకోవచ్చు. కానీ  పప్పూ ఉప్పూ  నూనె నెయ్యి  ఇలా ప్రతిదీ  పొరుగింటమ్మ దగ్గర చేబదులు తీసుకుని నడిపే దాన్ని సంసారం అనరు. ప్రభుత్వం అయినా అంతే’ 

05-12-2021