మనసు ముళ్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మనసు ముళ్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2014, శుక్రవారం

మనసు ముళ్లు


దూరానికి సరళరేఖల్లా కనబడ్డా

నిజానికి ఎన్నో కనబడని వొంకర్లు

ఆలోచనలకు పెయింట్ వేసి వుంచినా

నిద్రపట్టే వేళకు

మెదడు తుప్పురాలుతున్న చప్పుడు

నిశ్శబ్దం చేసే ధ్వని భరించడం ఎలా

పగలు పలురకాల అనుభవాల్ని నమిలి

నాలుక కొసతో నిశీధిని నంజుకుని

నవ్వినలిగి

పక్కపై చేరే సమయానికి

ఆలోచనల నల్లుల బారులు

లోపలి వ్యక్తి చేసే చీకటి ఆక్రందనలు

ఇక నిద్రపట్టడం ఎలా?

లేచి లైటు వెయ్యాలి.




భండారు శ్రీనివాస రావు