4, ఆగస్టు 2025, సోమవారం

ఫ్రెండ్ షిప్ డే

  స్నేహితుల దినం అంటూ చాలా మంది నా పేస్ బుక్ స్నేహితులు వారి దోస్తులను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టారు. వారూ, వారి ఫ్రెండ్స్ ధన్యులు.

నాకు ఒకే ఒక్క స్నేహితురాలు మా ఆవిడ నిర్మల. ఇక నాకు స్నేహితులు ఎవరూ లేరని కాదు. వున్నారు. పెళ్ళికి ముందు, తర్వాత నన్ను అస్తమానం అంటి పెట్టుకుని వున్న మనిషి ఈవిడే.
బహుశా నన్ను వదిలిపెట్టే రోజు, ఒకరోజు వస్తుందని ముందే తెలుసేమో ఏనాడు నన్ను వదిలిపెట్టి వుండలేదు.
ఈరోజు అని ఏమిటి ప్రతి రోజూ గుర్తుకు రావాల్సిన మనిషి.
ఆమె బతికివున్న రోజుల్లో ఈ ఎరుక వుంటే ఎంత బాగుండేదో కదా!



కామెంట్‌లు లేవు: