మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు
గారు పుట్టపర్తిలో వుండగా అనేక రచనలు చేస్తూ పోయారు. వాటిల్లో ఒకటి దశావతారాలు.
వారి చిన్నమ్మాయి వాణి వెల్దుర్తి, ఆ రాతప్రతిని చిన్ని పొత్తంగా తయారు చేసి,
కుటుంబ సభ్యులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచి పెట్టింది. ఈ విషయంలో వయస్సులో చిన్నదయినా
తను పడ్డ శ్రమదమాదులు ప్రసంశనీయం. ‘మళ్ళీ మనమధ్యకు నాన్న వచ్చారంటూ’ చిరంజీవి వాణి తన ముందు మాటగా నుడివిన మాటలు:
“చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు
వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి
వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే
వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో
రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. అవే: ఆత్మస్తుతి, పరనింద.
“ఆదర్శాల నయాగరాల కన్నా, ఆచరణల హిమబిందువు మిన్న
అని నమ్మిన మరువలేని, మరపురాని వ్యక్తి నాన్న. ఆ నాన్న ‘దశావతారాలు’ పుస్తకంతో
మళ్ళీ మన మధ్యకు వచ్చాడు.”
ఈ చిన్ని పొత్తానికి ముఖచిత్ర అలంకరణ చేసింది ‘రాంపా’

