ఈ ఉదయం సాక్షి టీవీ హెడ్ లైన్ షో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఈ ఉదయం సాక్షి టీవీ హెడ్ లైన్ షో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జూన్ 2014, బుధవారం

ఈ ఉదయం సాక్షి టీవీ హెడ్ లైన్ షో


"చమురు ధరలకు రెక్కలు, ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పంపిణీ వివాదం ప్రధాన అంశాలు. బీజేపీ తరపున శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు శ్రీ శ్రీనివాస గౌడ్, వై.ఎస్.ఆర్.సీ.పీ. తరపున శ్రీ నాగిరెడ్డి (ఫోన్ ఇన్ లో) నాతోపాటు చర్చలో పాల్గొన్నారు. సమన్వయకర్త శ్రీ దేవులపల్లి అమర్.
షరా మామూలుగా నా అభిప్రాయాలు.


"కఠిన నిర్ణయాలకు సిద్ధంగా వుండాలని ముందే హెచ్చరికలు చేశారు కాబట్టి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎవరు అధికారంలో వున్నా పెంచక తప్పదు. ప్రతిపక్షంలో వుంటే ఖండించక తప్పదు. పాత్రలు మారినప్పుడల్లా వారి గాత్రాలు మారిపోవడం మనకు కొత్తేమీ కాదు. మనది అభివృద్ధి చేడుతున్న ఆర్ధిక వ్యవస్థ. భారం పేదల మీద ఎక్కువగా పడకుండా చూడాలి. అయిదు కోట్లు ఖరీదు చేసే కారు యజమానీ, ఒక మామూలు ఆటోవాలా డీజిల్ కు ఒకే ధర చెల్లించడం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. స్తోమతను బట్టి పెరిగిన ధరలను భరాయించే విధానం ఏదైనా కనుక్కుంటే బాగుంటుంది. ఉదాహరణకు చిన్న కాలనీల్లో నివసించేవారు తాగే మంచి నీటికి చెల్లించే రేటు, సంపన్న ప్రాంతాలలో  రాజప్రసాదాలను తలపించే నివాసాల్లో  లాన్ల పెంపకానికి వాడే నీటికి కూడా ఒకటే రేటు. ఇలాటి వ్యత్యాసాలు తొలగించగలిగితే ధరలు పెంచినప్పుడల్లా ఆందోళన పడడం తగ్గిపోతుంది. కానీ ఈ సాధ్యమయ్యే పనేనా! నిధుల కొరత అనే పడికట్టు పదం పుట్టిందే ఇందుకు"