ఇదే నా తిరుపతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇదే నా తిరుపతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జనవరి 2025, గురువారం

ఇదే నా తిరుపతి

 పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!

ప్రోటోకాల్, వీవీఐపి దర్శనాలు  మూడు నెలలకు, లేదా ఆరు నెలలకు  ఒకసారి మాత్రమే అని నిబంధన విధించి, టెక్నాలజీ సాయంతో  అమలుచేస్తే రద్దీ సమస్య కొంత తగ్గుతుందేమో ఆలోచించాలి.

 అందుకే బాలాజీ దర్శనం చేసుకోవాలని అనిపించినప్పుడు హైదరాబాదులో మా అన్నయ్య కుమారుడు లాల్ బహదూర్ ఇంట్లో కొలువై వున్న ఈ వెంకన్నను  చూసివస్తాను. ఇదే నా తిరుపతి.