6, సెప్టెంబర్ 2022, మంగళవారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

 

“ ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండేవాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.
“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.
“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.
“ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.
“బోధివృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!
“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.
“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఏ సంఘటననైనా నిర్ణయించే గ్రహాలలో రాహుకేతువులు ప్రధానపాత్రలలో ఉంటాయండి అన్నీ జాతక మహిమ. మేటరయిపోయాకే వెలుగులో కొస్తాయి.

అజ్ఞాత చెప్పారు...

బ్లాగు లోకపు పెద్ద తలకాయలంతా భారతం లో అలా యెందుకు చేసారు ~ ఇలా యెందుకు కాలేదు అంటూ వాళ్లకు తెలిసిన గ్నానంతో ఓ టపా రాస్తారు.

హరిబాబు లాంటి వారు సవాలు విసిరితే
చుప్ చాపు గా "ఇంతతో ఈ చర్చ ముగిస్తున్నాను" అంటూ ఓ గడెట్టేసుకుంటారు.

ఏమిటో వీళ్ల భయ్యం ?

అజ్ఞాత చెప్పారు...

హరిబాబుకు కూడా ఎవరన్నా భయపడతారా అగ్నానీ?

అజ్ఞాత చెప్పారు...

మరి! ఇరవై నాలుగ్గంటలూ హరిబాబు వేసే సుత్తికామెంట్లకు జవాబులిచ్చుకుంటూ కాలక్షేపం చేస్తూ కూర్చుంటారా? ఇంకేం‌ పనీపాటా ఉండదా? హరిబాబుతో చర్చలు ఒక యుగంలో తెమిలేవా చచ్చేవా?

అజ్ఞాత చెప్పారు...

హరిబాబు మేధావి అని కఫ ఒప్పేసుకున్నారు కద అగ్నాని ?