30, జూన్ 2018, శనివారం

ఆదిరాజులాంటి జర్నలిష్టులు ఉంటారా? సేలం పాఠకుడి ఆశ్చర్యం! – భండారు శ్రీనివాసరావు

ఈ సాయంత్రం ఒక ఫోను కాల్ వచ్చింది. ‘సేలం నుంచి శ్రీధర్ విశ్వనాధన్ ని మాట్లాడుతున్నాను’ అన్నది అవతల గొంతు స్వచ్చమైన తెలుగులో. అప్పుడు నాకూ ఆశ్చర్యం వేసింది, తమిళనాడు అంటున్నాడు, ఈ తెలుగేమిటని. అదే అడిగాను. ‘పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నాను, అదో కధ. ముందు నేను ఫోను చేసింది ఆదిరాజు అనే జర్నలిష్టు విషయంలో’
‘ఆదిరాజా! ఆయన మీకెలా తెలుసు?’
‘మీరు ఈ రోజు ఆంధ్రప్రభలో ఆయన్ని గురించి ఓ వ్యాసం రాశారు. అది చదివిమీకు ఫోన్ చేస్తున్నాను. మీ పేరుతొ పాటు ఆంధ్రప్రభవాళ్ళు మీ నెంబరు కూడా ఇచ్చారు’
‘ఆంధ్రప్రభ’ సేలం లో దొరుకుతుందా”
‘దొరకదు, కానీ నేను నెట్లో చదువుతాను. ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు నాకు ఇదే పని’
‘అలాగా! సంతోషం. మీది తమిళనాడు, అక్కడ కూడా తెలుగువాళ్ళు చాలామంది వున్నారు. కానీ వాళ్ళ ఉచ్చారణ అదో రకంగా వుంటుంది. మీరెలా నేర్చుకున్నారు?’
‘పదేళ్ళ క్రితం నేనొకసారి రామోజీ ఫిలిం సిటీ చూడడానికి హైదరాబాదు వచ్చాను. రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవరు నా తెనుగు చూసి చిన్నతనంగా చూసాడు. దాంతో నాకు పట్టుదల పెరిగింది. మా వూరికి తిరిగొచ్చిన తర్వాత లైబ్రరీలకు వెళ్లి తెలుగు పుస్తకాలు తిరగేసేవాడిని. నెట్లో తెలుగు పత్రికలు చదవడం మొదలు పెట్టాను. తెలుగు సినిమాలు నెట్లో చూస్తాను. ఆ విధంగా నాకు తెలుగు భాష మీద పట్టు పెరిగింది. మరో సారి హైదరాబాదు వచ్చి ఆ ఆటో వాడితో తెలుగులో మాట్లాడాలి అనే కోరిక వుంది, కానీ అది సాధ్యపడే విషయం కాదు, నాకూ తెలుసు
‘........’
‘అసలు విషయానికి వస్తాను. ఆదిరాజు గారి గురించి చదివిన తర్వాత ఆయన మీద నా అభిమానం, గౌరవం పెరిగాయి. అసలు అలాంటి జర్నలిష్టులు ఈనాడు వున్నారా? మాదగ్గర పరిస్తితి మరీ ఘోరం. ఇక్కడ పత్రికలు విడిగా అమ్ముడు పోవు. పత్రికలే మొత్తంగా అమ్ముడు పోయాయి’
‘......’
‘ఏమండీ! ఆదిరాజు గారి కుటుంబానికి నా తరపున నమస్కారాలు చెప్పండి’
చివర చివర్లో నా మౌనానికి కారణం ఆయన మాటలకు నా గొంతు పూడిపోవడం.
మౌనమే ఆయనకు నా సమాధానం.
విశ్వనాధన్ గారి ఫోను నెంబరు: 070108420882 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

మీరిలా అందరి వ్యక్తిగత ఫోన్ నంబర్లు పోస్ట్ చేసేస్తే ఎలాగండి?

అజ్ఞాత చెప్పారు...

చింతకాయల ఉక్కు దీక్షకు నిమ్నకాయల తొక్కు దొరికింది. ఈ బుచికి దీక్షలతోని ఒరిగేదేమీ లేదు.