22, మార్చి 2016, మంగళవారం

దయచేసి వినండి


“టీవీ  చూస్తూ అడగొద్దు, దయచేసి నేరుగా  ఫోనులో మాట్లాడండి”.


టీవీ చర్చలు ఫాలో  అయ్యేవారికి చిరపరిచితమైన వాక్యం ఇది. 
చర్చల మధ్యలో వీక్షకులనుంచి ప్రశ్నలు లేదా వారి అభిప్రాయాలు తీసుకోవడానికి ఇప్పుడు అనేక ఛానల్స్ లో యాంఖర్లు ప్రయత్నించడం నిత్యం  అనుభవైకవేద్యమే. మామూలుగా బయట నుంచి ఫోను చేసేవాళ్ళు నేరుగా యాంఖర్ తో  కనెక్ట్ కారు. మధ్యలో ఎవరో ఆ కాల్  అందుకుని కనెక్ట్ చేస్తారు. కాల్ రాగానే  అతగాడే ఫోను చేసిన వారికి “టీవీ  చూస్తూ అడగొద్దు, దయచేసి నేరుగా  ఫోనులో మాట్లాడండి” అనే సూచన అందించగలిగితే  బుల్లి తెరలపై యాంఖర్లు పడుతున్న శ్రమ కొంత  తగ్గుతుంది. పనిలో పనిగా ఆ ప్రోగ్రాం చూసేవాళ్ళ బాధకు  కూడా కొంత  ఉపశమనం లభిస్తుంది.   

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...



వాగుడు కాయల ఏంకరు
డా! గురు భండారు మీకు డంకా జేసెన్
మీకు సువిధ జేయ గనెన్
సో, కాల్ రాగన సుఖముగ శోభిల్లు యిటన్