2, జులై 2015, గురువారం

దొందూదొందే


కొత్తగా పెళ్ళయిన వధూవరులను పల్లకిలో తీసుకువెడుతున్నారు. దారిలో పూతపూసిన చింత చెట్టు కనిపించింది.
'చింత చెత్తు పూత పూసింది' అన్నది పెళ్ళికూతురు.
ఆమెకు 'ట' పలకదు.
'పూతే కాలం వస్తే పూస్తుంది కదా!' అన్నాడు పెళ్ళికొడుకు. అతడికి 'చ' పలకదు.
ఈ ఇద్దరి మాటలు వింటూ అన్నాడు పల్లకి బోయీల్లో ఒకడు.

'దొందూదొందే కొందప్పా!'
అతగాడికి 'డ' పలకదు.  NOTE: Courtesy Image Owner