29, డిసెంబర్ 2018, శనివారం

Discussion | KCR may Announce Telangana Cabinet Members and over Seperat...





ప్రతి శనివారంమాదిరిగానే ఈ ఉదయం  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ పవన్

28, డిసెంబర్ 2018, శుక్రవారం

పేరులో’నేముంది’

“ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”
“ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’
నలభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.
ఇన్నేళ్ళుగా పరిస్తితి ఏం మారినట్టు లేదు.
అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు. శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, టు అని తగిలించుకోవచ్చు.
ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కదాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలురూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది. కొండొకచో ఇందువల్ల కొన్ని తలనొప్పులు కూడా తప్పడం లేదు. నిరుడు ఒక పెద్ద మనిషి ఫోను చేసి వాళ్లకు తెలిసిన వాళ్ళ పిల్లవాడికి మా ఇంజినీరింగు కాలేజీలో సీటు ఇప్పించమని అడిగాడు. ‘నా కాలేజీ ఏమిటి’ అని అడిగితే ‘భలేవారే ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులు కనబడుతుంటే మీరు భలే జోకులు వేస్తారే’ అన్నాడు.
అప్పటి నుంచి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద “బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజి’ అని రాసి వుంది.
అదట్లా వుంచితే.....
ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి పత్రికల్లో వచ్చింది.
నాఇంటిపేరు ‘షరా మామూలే’ - బండారు అనే వేశారు.
ఏమిచెప్పుదు సంజయా!


Image may contain: one or more people and text

The Fourth Estate | YSRCP Vanchana Pai Garjana Deeksha - 27th December 2018





ప్రతి గురువారం మాదిరిగానే రాత్రి సాక్షి టీవీ అమర్స్ "ఫోర్త్ ఎస్టేట్' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ శివ శంకర్ ( వైసీపీ), శ్రీ గంగాధర్ (కాంగ్రెస్), శ్రీ రఘురాం (బీజేపీ).

26, డిసెంబర్ 2018, బుధవారం

ప్రోటోకాల్ అనేది భగవద్గీత ఏమీ కాదు – భండారు శ్రీనివాసరావు




వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు దూరంగా వుండి నిరసన తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది. ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలకడం అనేది ప్రోటోకాల్ విధుల్లో భాగం కావచ్చు. గతంలో దాన్ని పక్కన బెట్టి ముఖ్యమంత్రులు వ్యవహరించిన దాఖలాలు వున్నాయి. ఉదాహరణకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా లేని స్తితిలో కూడా ఈ మర్యాదలు పాటించిన ముఖ్యమంత్రులు లేకపోలేదు. వీరిలో అగ్రగణ్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన భవనం ప్రారంభానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి వచ్చినప్పుడు రాజీవ్ ప్రసంగిస్తున్నంత సేపూ రామారావు ఆయన చెంతనే నిలబడిపోయారు. అలాగే ప్రధాని శ్రీ పీవీ నరసింహారావుకు భార్యతో కలిసి పాదాలు కడిగారు. ఆయన మర్యాదలు ఆవిధంగా ఉండేవి. రాజకీయంగా విబేధించినప్పుడు ఆ పాత్రలో ఆయన వేరేగా కనబడేవారు.

Image may contain: 1 person, standing

25, డిసెంబర్ 2018, మంగళవారం

Discussion | CM Chandrababu Naidu Serious Comments On PM Modi's AP Visit...







ఇది మామూలు షేరింగ్ కాదు. నా సొంత గొడవ కొంత వుంది. నా జీవితంలో మూడో వంతు రాజకీయ నాయకులతో గడిచిపోయింది, వృత్తి రీత్యా.  రాజకీయ  చర్చల్లో పాల్గొనేటప్పుడు వివిధ రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు కూడా వుంటారు. అలాగే ప్రేక్షకుల్లో సయితం అన్ని పార్టీల వాళ్ళు వుంటారు. నేను చెప్పే విషయాలు కొందరికి నచ్చితే, మరికొందరికి నచ్చక పోవచ్చు. ప్రశ్నని బట్టి జవాబు వుంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినదే నా నోటంట వినాలని వుండడం సహజం. కానీ కుదరదు కదా! అలాంటప్పుడు నేను ఏదో మనసులో పెట్టుకుని కావాలనే అలా మాట్లాడుతున్నానని అనుకోవడం కూడా సహజం. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని మా వ్యాఖ్యలను మంచి మనసుతో అర్ధం చేసుకోవాలని మనవి.

KSR Live Show: PM a 'hollow' man who 'spends tonne of money Says Chandra...





ప్రతి మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాశ రెడ్డి, వైసీపీ  (అనంతపురం నుంచి), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ  విల్సన్ (బీజేపీ), శ్రీ పి. ఎల్. శ్రీనివాస్ ( టీఆర్ ఎస్)

KSR Live Show: PM a 'hollow' man who 'spends tonne of money Says Chandra...





ప్రతి మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాశ రెడ్డి, వైసీపీ  (అనంతపురం నుంచి), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ  విల్సన్ (బీజేపీ), శ్రీ పి. ఎల్. శ్రీనివాస్ ( టీఆర్ ఎస్)