జోడుగుళ్ళ పిస్తోలు ఠా! - భండారు శ్రీనివాసరావు
ట్రిగ్గర్ నొక్కగానే వాయువేగంతో తూటా దూసుకుపోయే చిన్న పిస్తోళ్ళ నుంచి, పేల్చగానే గుళ్ళ వర్షం కురిపించే ఏకే 47 తుపాకుల వరకూ పెద్ద సంఖ్యలో గోడకు వేలాడుతూ కనిపించాయి.
బెల్ వ్యూ లో వున్న అనేక మారణాయుధాల దుకాణాల్లో (WADE) ఒకటి. కౌంటర్ మీద అమ్మే షాపే కానీ, వెంటనే డెలివరీ ఇవ్వరు. పోలీసు వెరిఫికేషన్ పూర్తయిన పిదప ఇస్తారు. అంతా ఆన్ లైన్ వ్యవహారమే కాబట్టి ఈ తతంగానికి ఎక్కువ సమయం పట్టదు.
ఈ దుకాణంలోనే ఫైరింగ్ రేంజ్ వుంది. కొంత రుసుము చెల్లిస్తే నిజమైన పిస్తోలుతో/ తుపాకీతో కాసేపు ఢమఢమలాడించి రావచ్చు.
అప్పటికే షాపులో ఇద్దరు ముగ్గురు యువకులు ఆయుధాలు కొనుక్కునే పనిలో ఉన్నారు.
వారం రోజుల క్రితం కుమారుడి పుట్టిన రోజు కానుకగా పిస్తోలు ఇవ్వడం, ఆ పిల్లాడు అది పట్టుకుని స్కూలుకు వెళ్ళి టపటపా నలుగుర్ని కాల్చి చంపడం టకటకా జరిగి పోయింది ఈ దేశంలోనే.
ఇది స్ఫురణకు రాగానే ఇది మనం మసిలే ప్రదేశం కాదని ఫొటోలు తీసుకుని బయట పడ్డాము.
7-9-2024
4 కామెంట్‌లు:
మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్.
రెండు టూచ్పాకీలు తీసుకొచ్చి ఒహటి మోదీగారికున్నూ ~ ఇంకొహటి నాయుడు గారికున్నూ ఇచ్చుండొచ్చుగదా ?
ఇలాంటి దుకాణాలు UP, Bihar లలో కూడా ఉంటాయి.
అమెరికాలో గన్ కల్చర్ పై ఈ దినం ఒక వార్తా పత్రికలో వచ్చిన ఒక సోషల్ మీడియా జోక్
అమెరికాలో ఒక వినియోగ దారుడు - " నాకు రెండు గన్నులు, అరవై బుల్లెట్లు, ఒక క్రోసిన్ ట్యాబ్లెట్ కావాలి.
దుకాణాదారు: సారీ, డాక్టరు చీటీ లేకుండా మేము క్రోసిన్ అమ్మం.😯
కామెంట్‌ను పోస్ట్ చేయండి