17, సెప్టెంబర్ 2024, మంగళవారం

తిన్నడి మార్గమే తిన్నని మార్గం



పురాణాల్లో చక్కటి నీతి కధలు వున్నాయి. పురాణాలు కధలా అనే వాదన తేకండి. అవన్నీ మనిషి మనిషిలాగా ఎలా జీవించాలి అని చెప్పేవే.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు. అంటే ఏమిటి దైవాన్ని అర్చించడానికి మడులు దడులు అక్కరలేదు. ఈ విషయం మనకు కిరాతార్జునీయం గాధలో స్పష్టంగా కనబడుతుంది. శుచిగా వండిన ప్రసాదాల కంటే ఆ పరమేశ్వరుడికి భక్తితో తిన్నడు సమర్పించిన మాంస ఖండాలే ప్రీతికరం అంటూ పెద్దలు బోధించిన నీతి కధలు వింటూ పెరిగిన తరానికి కూడా మంచి వాక్యాలు రుచించడం లేదు. ఇదొక విషాదం.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మీ ఆలోచన సరికాదు. దైవాన్ని అర్చించడానికి శుచి మడి అవసరమే. Kannappa is an exception and not a norm. మాంసం దైవానికి నివేదించడం నిషిద్ధం. గురువులు శాస్త్రం చెప్పిన వైదిక ఆచారాలు పాటించాలి. తొందరపడి తప్పుగా అన్వయం చేయడం సరికాదు.

అసలైన విషాదం ఏమిటంటే మీ వంటి పెద్దలు కూడా దైవార్చన సంప్రదాయం అర్థం చేసుకోలేక పోవడం.