15, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఎలా తినాలి అంటే ఇలా



పెద్ద హోటలే! ఏమున్నాయో చెబితే పర్వాలేదు కానీ, ఏది ఎలా తినాలో కూడా బొమ్మలు గీసి మరీ చెబితే ఎలా, అన్నప్రాశన నాడు తినిపించినట్టు. ఇంకా నయం గోరుముద్దలు చేసి నోట్లో పెడతాం అనడం లేదు.
శుక్రవారం సాయంత్రం బెల్ వ్యూ డౌన్ టౌన్ లోని ఆ హోటల్ కు చేరుకునేసరికే అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బయట కూర్చోవడానికి చాలా సోఫాలు, కుర్చీలు వున్నాయి. మాకు పిలుపు రావడానికి దాదాపు గంట పట్టింది.
లోపల విశాలమైన అయిదారు హాల్స్ వున్నాయి. ప్రతి దాంట్లో గుండ్రటి టేబుల్స్. వాటి చుట్టూ కూర్చుని చాలామంది డిన్నర్ చేస్తున్నారు. బహుశా నా లెక్క ప్రకారం లోపల మూడు వందలకు పైగా వున్నట్టున్నారు. నిశ్శబ్దం పాటిస్తున్న జాడ లేదు. ఇరవై ఏళ్లకు పూర్వానికి ఇప్పటికీ  నాకు అమెరికా జీవన విధానంలో కొట్ట వచ్చినట్టు కనపడిన మార్పు ఇదే. మొబైల్  ఫోన్ల మహత్యం అనుకుంటా.  
మాకు ఒక టేబుల్ చూపించారు. దానిమీద 'ఎలా తినాలి ?' అని రాసి వున్న డిస్ ప్లే బోర్డు కనిపించింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా తినాలో కూడా వాళ్ళే చెబుతారన్న మాట. 
బెల్ వ్యూ డౌన్ టౌన్ లో  DIN TAI FUNG అనేది ఓ పెద్ద చైనీస్ రెస్టారెంట్. చాలా అంటే చాలా ఖరీదైనది కూడా. 
XIAO LONG BAO అనే నోరు తిరగని వంటకం ఆ హోటల్ స్పెషాలిటీ.అది ఎలా తినాలి అని తెలియ చెప్పడానికే ప్రతి టేబుల్ మీద ఒక డిస్ ప్లే బోర్డు పెట్టారు.
ఇరవై ఏళ్ల చైనీస్ యువతి వచ్చి ఫుడ్ ఆర్థర్ తీసుకుంది. 21 ఏళ్లు దాటితే కానీ హాట్ డ్రింక్స్ సర్వ్ చేయరు. మా పక్క టేబుల్ మీద ఒక కుర్రాడు తన గుర్తింపు కార్డు చూపడం కనిపించింది. పైకి అంత వయసున్న వాడిలా లేడు. అందుకే వయసు ధ్రువ పరచుకోవడానికి సర్వరిణి అతడ్ని గుర్తింపు కార్డు అడిగింది. ఆ తర్వాతే డ్రింక్ ఆర్డర్ తీసుకుంది. మద్యం విషయంలో నిబంధనలను చూసీ చూడనట్లు వదిలేయకుండా పద్ధతిగా వ్యవహరించిన తీరు నన్ను ఆకట్టుకుంది.

ఆర్డరు తీసుకున్న కాసేపటికి గుండ్రటి చెక్క పళ్ళేలలో ఆ నోరు తిరగని పదార్థాన్ని అందరికీ సర్వ్ చేశారు. తీరా చూస్తే చిన్న సైజు నూనెలో వేయించని పూర్ణంబూరెల మాదిరిగా వున్నాయి. వీటిని ఓవెన్ లో వేడి చేసి ఇస్తారు. అవి ఎలా తయారు చేస్తారో చూడవచ్చు కూడా. చిన్న చిన్న పిండి ముద్దలను చేతితో అదిమి అందులో ఏదో పదార్థం కూరను కూరి, వుండగా చుట్టి ఓవెన్ లో కాసేపు వుంచి చెక్క పళ్ళేలలో పెట్టి వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు.
అలాగే ఉడికించిన ఆకు కూరలు వగైరా.   చైనీస్ కదా తినడానికి చాప్ స్టిక్స్ ఇచ్చారు. 
ఈ తతంగాన్ని యావత్తూ నేను ఆస్వాదిస్తున్నాను కానీ, తినే తిండిని కాదని అర్థం చేసుకున్న మా కోడలు భావన ఇంటికి రాగానే వేడిగా అన్నం వండి వడ్డించింది.
అన్నదాతా సుఖీభవ!

నీతి: ఇంట్లో వండి పెట్టేవాళ్ళు వున్నప్పుడే బయట ఇలాంటి ప్రయోగాలు చేయాలి.

5 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

ప్రస్తుతం బయటపడి సంచలనం పుట్టిస్తున్న తిరుచందురై సంఘటన జరిగిన తీరు ఇది. స్థానిక పౌరుడు, హరి అనుకుందాం, శ్యామ్ అనే అతనికి తన ఆస్తులలో ఒకదాన్ని అమ్మాడు. సహజంగా గ్రామాల భూముల్ని గ్రామకంఠం పేరున నమోదు చేస్తారు పంచాయితీ ఉద్యోగులు. అమ్మకాలు కొనుగోళ్ళ సమయంలో కూడా గ్రామకంఠం రికార్డుల్ని అప్డేట్ చేస్తారు. అయితే, ఇక్కడ శ్యామ్ బహుశా వేరే ఊరు అయ్యుండొచ్చు, లేదా అతను పక్కా రిజిస్ట్రాషన్ చేయించుకుందాం అనుకుని ఉండొచ్చు - రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడి ఉద్యోగి చెప్పాడు హరి అనే స్థానిక పౌరుడి భూమి వాకఫ్ అదీనంలో ఉంది కాబట్టి వాకాఫ్ బోర్డు నుంచి "NO OBJECTION CERTIFICATE" తెచ్చుకుంటే తప్ప అమ్మకం చెల్లుబాటు అవ్వదని.
దీని అర్థం ఏంటో ఇందులో ఉన్న దుర్మార్గం ఏంటో తెలుస్తున్నదా!జనాభా లెక్కలూ ఆస్తుల రిజిస్ట్రాషన్ వివరాలూ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి కేంద్రానికే వెళ్తాయి.రాష్ట్రాలు వసూలు చేసిన పన్నుల మొత్తం కూడా ముందు కేంద్రానుకి వెళ్లి కేటాయింపుల రూపంలో తిరిగి రాష్ట్రానికి వస్తాయి.
అలాంటి పరిస్థితిలో ఆ రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి ఇద్దరు భారత పౌరుల మధ్య జరిగిన ఆస్తుల బదలాయింపుని నమోదు చేయటటానికి భారత జాతీయ ప్రభుత్వానికి ఒక ప్రయివేటు మత సంస్థ నుంచి అనుమతి అవసరం అంటున్నాడు.
కేంద్ర ప్రభుత్వం vakf బోర్డులు అన్నీ అనుసరిస్తున్న షరియాత్ చట్టాన్ని రాజ్యాంగం కన్న పై స్థాయిలో నిలబెట్టింది.అంటే, మనది సెక్యులర్ దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో వాకఫ్ బిల్లుని చట్టం చేసి అమలు చెయ్యడం మొదలు పెట్టిన నాటినుంచి భారతదేశం మతరాజ్యం అయిపొయింది - INDIA IS AN EXTREMIST ISLAMIC COUNTRY, NOW ALSO.EVEN AFTER AMENDMENTS TO VAKF ACT 1990,STILL INDIA WILL CONTINUE AS AN ISLAMIC COUNTRY - UNTIL IT DISCARDS VAKF ACT COMPLETELY.
జై శ్రీ రామ్!

అజ్ఞాత చెప్పారు...



నువ్వెంత చెప్పు సెక్కులర్ మేధావులు మారరు

అజ్ఞాత చెప్పారు...

ఏమోయ్ హరిబబ్బూ

ఈ టపా ఏంటీ ? నీ సోదేంటీ ?

అజ్ఞాత చెప్పారు...

enti maastaaru, momo's tinataniki ganta wait chesara? :)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

తినడానికి కాదు, తినే వాళ్ళను చూడడానికి. పైగా శుక్ర వారం సాయంత్రం కదా. రష్ బాగా వుంది