17, జులై 2024, బుధవారం

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో హల్వా వుంటుందా!

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో హల్వా వుంటుందా! – భండారు శ్రీనివాసరావు 

ఢిల్లీ నార్త్ బ్లాక్ అంటే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొలువై వుండే కార్యాలయం. బడ్జెట్ తయారీ కార్యక్రమం అంతా అక్కడే జరుగుతుంది. దాదాపు ఓ వారం, పది రోజులపాటు సంబంధిత సిబ్బంది ఆల్ మకాం,  అంటే తిండీ తిప్పలు, పడకా, విశ్రాంతి పూర్తిగా అక్కడే. బడ్జెట్ పూర్తి అయ్యేదాకా ఇళ్లకు పోకుండా రాత్రింబవళ్ళు  ఆ కార్యాలయంలోనే వుండిపోతారు. చివరి రోజున పనిచేసిన  మొత్తం సిబ్బందికీ  కేంద్ర ఆర్థికమంత్రి  స్వయంగా అక్కడే హల్వా చేసి అందరికీ పంచుతారు. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న వేడుక ఇది. స్వయంగా అంటే మంత్రిగారే హల్వా చేస్తారని కాదు. కడాయిలో తయారైన హల్వాను పెద్ద గరిటతో అలా అలా  పైపైన ఒకసారి కలుపుతారని అర్ధం చేసుకోవాలి. కోవిడ్ కారణంగా రెండేళ్లు హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు.

బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓ తోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్ధిక మంత్రి సభకు వస్తారు. నాకు తెలిసి నార్త్ బ్లాకులోనే ఒక ముద్రణాయంత్రం వుండేది. ఇప్పుడు వుందో లేదో తెలియదు.  డిజిటల్ శకం మొదలయిన తర్వాత  లెదర్ బ్యాగు సైజు, స్వరూపం పూర్తిగా మారిపోయాయి. 
 చూడాలి ఈ ఏడాది బడ్జెట్ లో హల్వా (సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేవి) వడ్డిస్తారా! అంతకు మించింది ఏమైనా జనాలకు అందిస్తారా!

కింది ఫోటో:
ఈరోజు ఒక దినపత్రికలో వచ్చిన చిత్రం

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గత పదేళ్లుగా వేతన మధ్య తరగతి జీవులు బడ్జెట్ లో క్యారెట్ హల్వా కోసం చూస్తున్నారు అయితే కాకరకాయ హల్వా తో సరిపెడుతున్నారు.

తాజా గణాంకాల ప్రకారం ప్రత్యక్ష పన్నులు అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వానికి సమకూరే ధనం కార్పొరేట్ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ గా ఉంది.

"Personal income tax (PIT) receipts constituted 60.2% of the net collections at ₹3.46 lakh crore, rising 21.4% year-on-year, while corporate taxes yielded 36.6% of net revenues at ₹2.1 lakh crore, reflecting a 12.5% growth." - Report in The Hindu dt.13-7-24

Prof Nageshwar garu made a good video on this issue.

https://youtu.be/6pVDo2aX8Rg?si=QvSBD7cHA3G_wP-k

18% GST on health insurance premiums is totally unjustified.

Taxpayers don't have any say on how the public money is being spent. Good portion of the it goes to fund freebies and many welfare schemes. Salaried individuals pay taxes and get a raw deal in return. Hope for a change.

Zilebi చెప్పారు...

హల్వా కాదంటా
ఈ సారి స్పెషల్ ట్విస్టడ్ స్వీటట :)

అజ్ఞాత చెప్పారు...

బడ్జెట్ లో హల్వా బదులు మెలికల్ తీపి వంటకం ఇస్తే బాగుంటుంది.

అజ్ఞాత చెప్పారు...

మిఠాయిలో మెలికల్
మాటల్లో వంకరల్
పద్యాల్లో పిడకల్
ఎక్కడుందో జిలేబుల్

బాబే చెప్పారు...

ఒకప్పుడు బ్లాగుల్లో కృష్ణ అని ఉండేవారు .. ఆయన వయసు ప్రస్తుతం 80 ఉండవచ్చు .. ఒక వేళ ఈ krishna వయసు అంతకన్నా తక్కువ అయితే దొంగ కృష్ణ అనవచ్చా ..

Krishna కి Krishna K కి వ్యత్యాసం ఉన్నట్లే

Chakirevu కి Chakirev కి కూడా తేడా ఉంది కదా ..

అంటే మీ "పచ్చ" పార్టీ కి వ్యతిరేకంగా ఉంది కదా అని దొంగ చాకిరేవు అంటారా ..

అసలు దొంగ చాకిరేవు అని అనడం బాలేదు .. దాన్ని సమర్ధించుకోడం అస్సలు బాలేదు

అజ్ఞాత చెప్పారు...

బాగా చెప్పారు. పచ్చ ఇకో సిస్టమ్ లో ఈ అహంకారం బాగా కనిపిస్తుంది. తాము చెప్పిందే రైటు. తమ క్యాంపు లో లేని వాళ్ళు అంటే వారికి అంత ద్వేషం.

అజ్ఞాత చెప్పారు...


ప్రస్తుత రాజకీయ మీడియా ధోరణి పై ఒక తవిక.

నాటు నాటు వీర నాటు

మేము చెప్పిందే రైటు
మీరు చెబితే చేటు

మేము చేస్తే నీటు
మీరు చేస్తే నాటు

మా క్యాంపులోనుంటే స్వీటు
అటు వైపుంటే బ్రూటు

మా వాళ్ళంతా బెస్టు
మీ వైపందరూ వేస్టు

మీదంతా అవినీతి
మేము చేస్తే అదే నీతి

మా పనులన్నీ మోదం
మీ కర్మలన్నీ ఖేదం

మీరు మంచి చేసినా ఒప్పుకోం
మా తప్పు ఎప్పుడూ చెప్పుకోం

మీరు చేస్తే పరమ స్వార్థం
మేము చేసిందే పరమార్థం

అజ్ఞాత చెప్పారు...

అనుకున్నట్టే కాకరకాయ హల్వా బడ్జెట్ వచ్చేసింది. యథా ప్రకారం వేతన జీవులకు వేదన మాత్రమే.

మధ్యతరగతి వేతన జీవుల డ్యూటీ ఓట్లు వేయడం, టాక్సులు కట్టడం. అంతే.

ఆంధ్రకు కేటాయింపులు ఉన్నాయి అని ఏదో చెబుతున్నారు. అవన్నీ ఎంతమాత్రం ఆచరణ రూపం లోకి వస్తాయో తెరియాదు.

మెలికల్ మిఠాయి తిని ఒక టీ తాగి టీవీ సీరియల్ చూసుకోవడం బెటర్.

అజ్ఞాత చెప్పారు...

అసంతృప్తి జీవి




gలేబుల్