13, జులై 2020, సోమవారం

ఆడని సినిమాలు


నాకు ఊహ తెలిసినప్పటినుంచి, తెలియక ముందు నుంచి గత డెబ్బయి అయిదేళ్లకు పైగా సినిమాలు ఆడుతూనే వున్నాయి. వాటిల్లో బాగా ఆడిన సినిమాలు, సరిగా ఆడని సినిమాలు అంటూ ఉండేవి కానీ అసలు సినిమాలు  ఆడని రోజులు ఉండేవి కావు. కర్ఫ్యూలు, బంద్ ల సందర్బాలలో సినిమాహాళ్ళు మూసేసినా అది తాత్కాలికం. చిన్నప్పుడు మా వూళ్ళో సినిమా హాలు లేదు కాని పొరుగున మూడుమైళ్ళ దూరంలో వున్న ఊళ్లలో టూరింగు టాకీసులు ఉండేవి. అలాంటిది జీవితంలో మొట్టమొదటిసారి  ఉంటున్న ఊళ్లోనే కాదు యావత్ దేశంలో ఎక్కడా సినిమాలు ఆడని పరిస్తితి కనిపిస్తోంది. ఒక్కరోజు కాదు, నాలుగు మాసాలుగా ఇదే పరిస్తితి. ఈ శతాబ్దంలోనే కాదు,  గత శతాబ్దంలో సయితం  ధియేటర్లు వుండికూడా  ఎక్కడా సినిమాలు ఆడకపోవడం అన్నది  ఇదే  మొదటిసారి. గతంలో టీవీలు వచ్చిన కొత్తల్లో అనుకునేవాళ్లు ఇక సినిమాల శకం ముగిసిపోయిందని. అలా జరగలేదు. పైగా సినీరంగం మరింత విస్తరించింది.

ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ దశ కూడా చూస్తున్నాం. ఇది తాత్కాలికం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ రంగంలో కోటికి పడగలెత్తినవాళ్ళతో పాటు పూటగడవని వాళ్ళు కూడా వున్నారు. (13-07-2020)       


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

కరోనా ప్రభావం అన్ని రంగాలు అన్ని ప్రజలు మీద ఉంది.

ఇంకో ఏడాది పాటు ఆర్థిక సామాజిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటుంది.

సినిమా కార్మికులు ఆ రంగం వదిలేసి ఇతర ఉపాధి చూసుకోవాలి. పండ్లు కూరగాయలు కొబ్బరి బొండాలు అమ్ముకో వాలి.

ఒక్క పుడమి తల్లి మాత్రమే ఇప్పుడు ప్రజలకు ఆసరా ఇస్తుంది. వ్యవసాయ ఆధారం వ్యవసాయ ఉత్పత్తులు ఆదుకుంటాయి.

ఉద్యోగస్తులు ఖర్చులు తగ్గించు కుంటారు. పెళ్లిళ్లు జననాలు వాయిదా వేసుకుంటారు. మరణాలు మాత్రం వాయిదా ఉండదు.