9, నవంబర్ 2019, శనివారం

ఆలాపన – భండారు శ్రీనివాసరావు.



సినిమా నుంచి బయటకు రాగానే పక్కనే ఉన్న తాజ్ మహల్ కు వెళ్లి కాఫీ తాగి నడుచుకుంటూ చిక్కడపల్లి లోని ఇంటికి రావడం అలవాటు. హోటల్లో జనం పల్చగా వున్నారు. మా పక్క టేబుల్ మీద ఓ యువ జంట చూడ ముచ్చటగా వున్నారు.
టిఫిన్ చేసి వాష్ రూమ్ కు వెళ్లి వస్తుంటే మరో టేబుల్ మీద అనిల్, అతడి భార్య కనబడ్డారు. నన్ను చూడగానే అతడు బాధగా మొహం పెట్టాడు.
‘విషయం తెలిసింది, వద్దామని అనుకున్నాను. వేరే వూళ్ళో వుండడం వల్ల రాలేక పోయాను. సారీ బాస్.’
అతడేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు.
‘మేమూ అటువైపే వెడుతున్నాం. పదండి కార్లో డ్రాప్ చేస్తాను’ అన్నాడు.
‘థాంక్స్. మేమూ కార్లోనే వచ్చాము. అదే ఉబెర్. అదుంటే కారూ, డ్రైవర్ రెండూ ఉన్నట్టే’ నవ్వాను.
అతడు విచిత్రంగా చూసాడు.
‘సరే. నీ మాటే వింటాను. ఒక్క నిమిషం’ అంటూ మా టేబుల్ వైపు వెళ్లాను. యువ జంట అక్కడే వుంది. ఎవరూ లేరు.
నా కళ్ళు హోటల్ అంతా పరికిస్తున్నాయి.
అనిల్ వచ్చి భుజం మీద చేయేసి పదండి బాస్ అన్నాడు.
మెలకువ వచ్చి చూస్తే గడియారం మూడు చూపెడుతోంది.
చిక్కడపల్లి ఇంట్లో వుండి నలభయ్ ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు ఉబెర్లు ఎక్కడివి.
క్రమంగా వాస్తవం బోధపడింది.
కాకతాళీయం కావచ్చేమో కానీ ఇద్దరం కలిసి బుక్ మై షో ద్వారా ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుని పంజాగుట్ట గలేరియా మాల్ మల్టిఫ్లెక్స్ లో అనేక సినిమాలు చూశాము. ఉబెర్లో వెళ్ళడం ఉబెర్లో రావడం.
జనవరిలో NTR కధానాయకుడు, F2, మార్చిలో మా మేనల్లుడి కొడుకు విమల్ నటించిన జెస్సీ, లక్ష్మీస్ NTR, మేలో మహర్షి, జులైలో ఓ! బేబీ, చివరిగా అదే నెల 31 న డియర్ కామ్రేడ్.
అంతే! అదే ఆఖరు. ఆగస్టు 17 న తను లేదు.
ఏ సినిమా అయినా చూసి సూపర్ అంటుంది. సినిమా ఒక్కటే తను అడిగే కోరిక. నిజానికి అది పెద్ద విషయమేమీ కాదు. కానీ నాకు బోర్. అందుకే నా ఇతర కార్యక్రమాలకు అడ్డం రాకుండా మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం నాలుగు గంటలకు వుండే సినిమాలు బుక్ చేసేవాడిని.
ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం.
జేీవితమే సినిమా అయిపోయింది.
ఇష్టం లేకపోయినా, బోరు కొట్టినా చూడక తప్పదు.


4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఎన్టీఆర్ కథానాయకుడు లో బుల్ బుల్ దెబ్బకు మహానాయకుడు చూసినట్టు లేరే.
ఈ రెండు బయోగ్యాస్ లు చూసినవాళ్లు కొంతమంది ఇంకా తేరుకోలేదు.

అజ్ఞాత చెప్పారు...

బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్ట్ వారు
ప్రదానం చేసే
గోదావరి పురస్కారమహోత్సవం-2019
సన్మానాల కార్యక్రమంలో
మీరు
”గోదావరి” ఉత్తమ పాత్రికేయ పురస్కారం
12.11.2019 తేదీన రాజమంద్రిలో స్వీకరించబోతున్న సందర్భంగా

అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

Sad to know but time will heal the pain. May her soul rest in peace. Take care.

బళ్ల సుధీర్ చెప్పారు...

అజ్ఘ్నాతి గా నాలుక దురద తీర్చుకున్నావా పిరికి నా కొడకా ... నీలాంటి చిల్లర పేడ పురుగులు అక్కడే పుట్టి అక్కడే పోతారు .... కానీ వారి గొప్పతనం ఏం తగ్గదు