8, జూన్ 2019, శనివారం

సీతారాం జయ సీతారాం – భండారు శ్రీనివాసరావు

శనివారం రాత్రి సీతారాం ఫోన్. అంతకు ముందు రోజు జ్వాలా ఇంట్లో వుండగా చేసిన ఫోనుకు ఇది రిప్లై కాల్.
సంతోషం అనిపించింది. ఎప్పటివో పాతికేళ్ళ నాటి కబుర్లు తిరగమోత పెట్టుకున్నాం. ఎన్ని సాయంత్రాలు ఆయన దగ్గర గడిచాయో తెలవదు. మంచి స్నేహితుడు. అయినా ఆయన వ్యవహారాలు ఆయనవి. మన పద్దతులు మనవి.
ఆయనో మినిస్టరు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఎక్సైజ్, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి. ఎన్నో పని ఒత్తిడులు. అయినా స్నేహితులకు మాత్రం ఎప్పుడూ దగ్గరే. కల్మషం ఎరుగని రీతిలో ముచ్చట్లు. నేను సీతారాంని అల్లూరి సీతారామారాజు అని పిలిచేవాడిని ఆయన గడ్డాన్ని చూసి.
చాల ఏళ్ళుగా మా మా మధ్య ఫోను సంభాషణలు కూడా లేవు. అయినా ఆ నాటి స్నేహబంధం తెగలేదని ఈరోజు తెలిసింది. అది నిజంగా తమ్మినేని సీతారాం గొప్పతనం. గుర్తు పెట్టుకోవడానికి, గుర్తుంచుకుని పలకరించడానికి నా వద్ద మిగిలినవి ఏమీ లేవు.
ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్.

కామెంట్‌లు లేవు: